
పాక్‌లో ఆత్మాహుతి దాడి; 25 మంది మృతి
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 25 మంది మృతి చెందారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 25 మంది మృతి చెందారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ దాడిలో పాకిస్తాన్ సెనెట్ డెప్యూటీ చైర్మన్ మౌలానా అబ్దుల్ ఘఫూర్ హైదరీ ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు. హైదరీ లక్ష్యంగానే ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. మస్తాంగ్ జిల్లాలో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా మౌలానా అబ్దుల్ ఘఫూర్ హైదరీ మసీదులో ముస్లింలనుద్దేశించి ప్రసంగించారు. ప్రార్థనల అనంతరం ఆయన తన కాన్వాయ్‌తో అక్కడ్నుంచి తిరిగివస్తుండగా ఆత్మాహుతి దాడి జరిగింది.