మైక్రోసాఫ్ట్‌కు బిల్‌గేట్స్‌ రాజీనామా

Bill Gates Step Down From Microsoft Board Over Philanthropy - Sakshi

న్యూయార్క్‌ : ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ బిల్‌గేట్స్‌ మైక్రోసాఫ్ట్‌నుంచి వైదొలిగారు. ప్రస్తుతం బోర్డు సలహాదారుడిగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పూర్తిస్థాయిలో సామాజిక సేవలకు పరిమితమవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, 2014లో ఆయన మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌ పదవినుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. 2000లో సీఈఓ పదవికి రాజీనామా చేసిన ఆయన 2008నుంచి ఫుల్‌టైం పనికి కూడా గుడ్‌బై చెప్పారు. 1975లో మైక్రోసాఫ్ట్‌ను స్థాపించి దాన్ని ప్రపంచ నెంబర్‌ వన్‌ స్థాయికి తీసుకెళ్లారు. సామాజిక బాధ్యతతో ప్రపంచవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

చదవండి : మళ్లీ నెం.1గా బిల్‌ గేట్స్‌

బిల్‌గేట్స్‌ ముచ్చట ఖరీదు రూ. 4600కోట్లు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top