ఎయిర్ ఆసియా బ్లాక్ బాక్స్ లభ్యం | Air Asia is available in a black box | Sakshi
Sakshi News home page

ఎయిర్ ఆసియా బ్లాక్ బాక్స్ లభ్యం

Jan 13 2015 3:42 AM | Updated on Sep 2 2017 7:36 PM

రెండువారాల కిందట జావా సముద్ర జలాల్లో కూలిన ఎయిర్ ఆసి యా విమానం ఫ్లైట్ డాటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లను సోమవారం డైవర్లు కనుగొన్నారు.

జకార్తా/సింగపూర్: రెండువారాల కిందట జావా సముద్ర జలాల్లో కూలిన ఎయిర్ ఆసి యా విమానం ఫ్లైట్ డాటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లను సోమవారం డైవర్లు కనుగొన్నారు. ఇందులో ఫ్లైట్ డాటారికార్డర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను కూడా దీనికి 20 మీటర్ల దూరంలో గుర్తించినప్పటికీ ఇంకా వెలికి తీయలేదు.

విమానం సముద్రంలో కూలినప్పుడు నీళ్లను బలంగా ఢీకొనడంతో ఆ రాపిడికి పేలిపోయిందని ఇండోనేసియా అధికారులు తెలిపారు. కీలకమైన ఈ పరికరాలు లభ్యంకావడంతో విమానం కూలిపోవడానికి గల కారణాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు. అంతకు ముందు ఈ పరికరాల నుంచి వచ్చే సంకేతాలను స్పష్టంగా గుర్తించడానికి పరసరప్రాంతాలనుంచి వెళ్లే నౌకలను అక్కడ తమ పనులకోసం రేడియో సందేశాలు పంపకుండా చూశామని సెర్చ్ ఆపరేషన్ డెరైక్టర్ సుప్రియాది తెలిపారు.

కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, కూలిన విమానం రెక్క కింద భాగం లో ఉన్నట్టు తెలుస్తోందని, ఆ రెక్క చాలా బరువుగా ఉండటంతో వాయిస్ రికార్డర్‌నుఇంకా వెలికి తీయలేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement