సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డవలప్మెంట్ అథారిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.
హైదరాబాద్: సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డవలప్మెంట్ అథారిటీ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. హైదరాబాద్ పార్టీ ప్రధాన కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడుతూ...చంద్రబాబు రాజధాని ముసుగులో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
సీడ్ క్యాపిటల్ పరిధిని మరింతగా పెంచినందుకు పూర్తిగా 20 గ్రామాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఎమ్మెల్యే ఆళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు బూడిదే మిగిలిందన్నారు. అధికార పార్టీ నేతలను రైతులు వెంటపడి తరిమే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. భూములిచ్చిన రైతులకు ముంపు ప్రాంతాల్లో స్థలాలు కేటాయించడం దారుణమని ఆళ్ల అన్నారు.