అసెంబ్లీ దృష్టికి జిల్లా సమస్యలు | district Issues to the attention of the assembly | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ దృష్టికి జిల్లా సమస్యలు

Aug 18 2014 1:42 AM | Updated on May 28 2018 3:33 PM

జిల్లాలో నెలకొన్న పలు సమస్యలను సోమవారం నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ దృష్టికి తీసుకురానున్నారు.

సాక్షి ప్రతినిధి, గుంటూరు : జిల్లాలో నెలకొన్న పలు సమస్యలను సోమవారం నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ దృష్టికి తీసుకురానున్నారు. ఈ మేరకు నియోజకవర్గాల్లో గుర్తించిన ప్రధాన సమస్యలపై సమగ్ర నివేదికలను సిద్ధం చేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న వేధింపులు, దాడులను వివరించడంతోపాటు వాటి విచారణలో జాప్యాన్ని ఎలుగెత్తిచాటనున్నారు.
 
ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక సమయంలో ఎంపీటీసీ సభ్యుల కిడ్నాప్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబులపై దాడి తదిత ర అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించనున్నారు. రేషన్ డిపోలున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు వాటిని వదిలి వెళ్లే విధంగా అధికారులు వేధింపులకు పాల్పడుతున్న వైనాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకురానున్నారు. జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, షేక్ మొహమ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రస్తావించనున్న ప్రధాన
 
సమస్యల వివరాలు ఇవీ..
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
రాష్ట్రంలో ప్రధాన పట్టణంగా అవతరించనున్న మంగళగిరి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరనున్నారు. మంగళగిరి పట్టణంలో చేనేత క్లస్టర్ ఏర్పాటు చేసి నేతన్నలను ఆదుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా చేనేత రుణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేయనున్నారు. మంగళగిరిలో తాగునీటి పథకం నిర్మించాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల విస్తరణ చేపట్టి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని కోరనున్నారు. చేనేత కార్మికులతో పాటు స్వర్ణ కార్మికులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు అందజేసి రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేయనున్నారు. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డును అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్ది పసుపు మద్దతు ధర రూ.10 వేలకు తగ్గకుండా ప్రకటించాలని కోరనున్నారు.
 
బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి
ఎంతో చరిత్ర కలిగిన బాపట్ల వ్యవసాయ కళాశాలను యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని, బాపట్ల శ్రీభావన్నారాయణస్వామి ఆలయూన్ని అభివృద్ధి చేయూలని, గుంటూరు-బాపట్ల మధ్య నాలుగులైన్ల రహదారి ఏర్పాటు చేయూలని కోరనున్నారు. బాపట్ల పట్టణాన్ని టెంపుల్ టౌన్‌గా, సూర్యలంక బీచ్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేయనున్నారు. రైతులు, మహిళలు ఎంతో అదృతగా ఎదురుచూస్తున్న రుణమాఫీపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. విద్యుత్, పరిశ్రమలు, విద్యారంగాలపై పలు ప్రశ్నలు వేయనున్నారు.
 
నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
నరసరావుపేట పట్టణం శంకరమఠం వద్ద రైల్వే అండర్‌బ్రిడ్జి, భరంపేటకు వెళ్లే రహదారిలోని రైల్వే గేటు వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. నరసరావుపేట మండలానికి తాగునీరు అందించేందుకు రొంపిచర్ల మండలం విప్పర్ల వద్ద రూ.30 కోట్లతో తాగునీటి పథకం నిర్మాణం పూర్తిచేయూలి. మండలంలోని కాకాని వద్ద జేఎన్‌టీయూ మంజూరు చేయాలి. నరసరావుపేట, రొంపిచర్ల రోడ్డు డబ్లింగ్‌కు రూ.10 కోట్లు మంజూరు చేయాలి. త్వరలో జరుగనున్న నరసరావుపేట మున్సిపాలిటీ వందేళ్ల ఉత్సవాలకు రూ. 10 కోట్లు మంజూరు చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement