ప్రశ్నిస్తే పోలీసులతో దాడులు చేయిస్తారా? | Will the Asked attack the police? | Sakshi
Sakshi News home page

ప్రశ్నిస్తే పోలీసులతో దాడులు చేయిస్తారా?

Aug 24 2017 3:31 AM | Updated on Oct 30 2018 7:50 PM

ప్రశ్నిస్తే పోలీసులతో దాడులు చేయిస్తారా? - Sakshi

ప్రశ్నిస్తే పోలీసులతో దాడులు చేయిస్తారా?

కాళేశ్వరం ప్రాజెక్టుపై అభ్యంతరాల గురించి మాట్లాడిన మాజీమంత్రి శ్రీధర్‌బాబుపై పోలీసులతో దాడులు చేయించారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి సమంజసమేనా.. అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క
సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుపై అభ్యంతరాల గురించి మాట్లాడిన మాజీమంత్రి శ్రీధర్‌బాబుపై పోలీసులతో దాడులు చేయించారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి సమంజసమేనా.. అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రజాభిప్రాయ సేకరణలో టీఆర్‌ఎస్‌ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రైతుల తరపున ప్రశ్నించడం చట్ట వ్యతిరేకమా, నేరమా.. అని భట్టి ప్రశ్నించారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ప్రజాస్వామికంగా ప్రశ్నించిన శ్రీధర్‌బాబును అరెస్టు చేయడం సరికాదని, దీనిని ఖండిస్తున్నామని భట్టి అన్నారు. శ్రీధర్‌బాబుకు టీఆర్‌ఎస్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement