హైదరాబాద్లో రెండు రోజుల్లో వైఫై | Wi-Fi in Hyderabad within two days | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో రెండు రోజుల్లో వైఫై

Aug 16 2014 7:49 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్లో రెండు రోజుల్లో వైఫై - Sakshi

హైదరాబాద్లో రెండు రోజుల్లో వైఫై

హైదరాబాద్ను వైఫై సిటీ చేసేందుకు మరో రెండు రోజుల్లో శ్రీకారం చుట్టనున్నారు.

హైదరాబాద్‌: హైదరాబాద్ను  వైఫై సిటీ చేసేందుకు మరో రెండు రోజుల్లో   శ్రీకారం చుట్టనున్నారు. మొదటగా గాంధీ ఆస్పత్రి, నెక్లెస్‌ రోడ్‌లో వైఫై సౌకర్యం కల్పిస్తారు.  హైదరాబాద్ నగరమంతా వైఫై సౌకర్యం విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. 4జీ, వైఫై సేవలు అందుబాటులోకి వస్తే ఒకే బిల్లుతో ఇంటర్నెట్, టీవీ, సెల్‌ఫోన్ సేవలన్నీ పొందవచ్చునని చెబుతున్నారు.

వైఫై(వైర్లెస్ ఫిడెలిటీ- Wireless Fidelity(Wi-Fi) అంటే ఎటువంటి వైర్లు లేకుండా ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రావడం.  ఇంక్యుబేటర్ ఏర్పాటుకు ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటి), ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి) వంటి ప్రముఖ విద్యాసంస్థలను భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా ఈ పనులను అధికారులు వేగవంతం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement