మంగళవారం ట్రాఫిక్ ఆంక్షలు | Traffic diversions on 6th April | Sakshi
Sakshi News home page

మంగళవారం ట్రాఫిక్ ఆంక్షలు

Apr 4 2016 7:32 PM | Updated on Sep 4 2018 5:07 PM

బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఎల్బీ స్టేడియం సమీపంలో ఉన్న ఆయన విగ్రహం వద్ద వివిధ కార్యక్రమాలు జరుగనున్నాయి.

హైదరాబాద్ : బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఎల్బీ స్టేడియం సమీపంలో ఉన్న ఆయన విగ్రహం వద్ద వివిధ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ చీఫ్ జితేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అబిడ్స్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను గన్ ఫౌండ్రీ ఎస్బీహెచ్ నుంచి చాపెల్ రోడ్ మీదుగా మళ్లిస్తారు. అలాగే అబ్దుల్ రెహమాన్ పెట్రోల్ పంప్ నుంచి వచ్చే వహనాలను బీజేఆర్ విగ్రహం వైపుకు అనుమతించరు. నాంపల్లి మీదుగా మళ్లిస్తారు. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి రాత్రి రాత్రి 10 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement