ఈ-జిల్లాగా హైదరాబాద్! | This is - in the district! | Sakshi
Sakshi News home page

ఈ-జిల్లాగా హైదరాబాద్!

Dec 19 2013 5:51 AM | Updated on Sep 2 2017 1:46 AM

హైటెక్ జిల్లాగా పేరుగాంచిన హైదరాబాద్ ఇకపై ఎలక్ట్రానిక్ డిస్ట్రిక్ట్‌గా మార నుంది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లోని అధికారులందరికీ ల్యాప్‌ట్యాప్‌లు...

=విలువైన రికార్డుల కంప్యూటరైజేషన్‌కు కలెక్టర్ ఆదేశం
 =జిల్లాలోని అధికారులందరికీ ల్యాప్‌ట్యాప్‌లు
 =అన్ని కార్యాలయాలకు డెస్క్‌టాప్‌లు, స్కానర్లు

 
సాక్షి, సిటీబ్యూరో/కలెక్టరేట్, న్యూస్‌లైన్: హైటెక్ జిల్లాగా పేరుగాంచిన హైదరాబాద్ ఇకపై ఎలక్ట్రానిక్ డిస్ట్రిక్ట్‌గా మార నుంది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లోని అధికారులందరికీ ల్యాప్‌ట్యాప్‌లు, అన్ని కార్యాయలయాలకు డెస్క్‌టాప్‌లను అందజే యనున్నట్లు జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాలకు కంపూటర్లతో పాటు స్కానర్లు, ప్రింటర్లు, యూపీఎస్‌లు కూడా ఇస్తామన్నారు.

ఆయా విభాగాలకు సంబంధించి విలువైన పాత రికార్డులన్నింటినీ గుర్తించి, వాటిని జాగ్రత్తగా స్కాన్ చేసి భద్రపరచాలని సూచించారు. సొంత భవనాల్లేని ప్రభుత్వ విభాగాలకు అవసరమైతే స్థలాలను కేటాయిస్తామని చెప్పారు. విభాగాల వారీగా అవసరమైన కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రభుత్వ స్థలాలు.. తదితర వివరాలను వెంటనే జిల్లా యంత్రాంగానికి అందజేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 974 అంగన్‌వాడీ కేంద్రాలుండగా వాటిలో కేవలం ఆరు కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలున్నట్లు ఐసీడీఎస్ పీడీ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించే విషయమై సహకరించాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు.
 
పటిష్టంగా భూముల పరిరక్షణ

అనంతరం రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి, వాటి పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని తహశీల్దార్లను ఆదేశించారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ స్థలాలను క్షణ్ణంగా పరిశీలించి రెగ్యులరైజ్ చే యాలని సూచించారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి వివరాలను ల్యాండ్ బ్యాంకులో పొందుపరచాలని ఆదేశించారు. ఆపద్భందు పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు స త్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. మిగు లు భూములను గుర్తించి హద్దులను నిర్ణయిం చాలన్నారు. వివిధ సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు కేటాయించిన స్థలాలను, ఆయా సంస్థలు వినియోగించుకోని పక్షంలో నోటీసులు జారీ చేసి వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీధర్, డీఆర్‌ఓ అశోక్‌కుమార్, ఆర్డీఓలు నవ్య, కిషన్‌లతో పాటు తహశీల్దార్లు, కలెక్టరేట్ పరిపాలన అధికారి రవీందర్ తదితరులున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement