ఈ యూనివర్సిటీలు, కాలేజీలు నకిలీవే | this is are fake Universities, colleges | Sakshi
Sakshi News home page

ఈ యూనివర్సిటీలు, కాలేజీలు నకిలీవే

Aug 19 2016 2:21 AM | Updated on Jul 26 2019 4:10 PM

ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలు, రాష్ట్రానికి చెందిన పలు కాలేజీలు తెలంగాణలో స్టడీ సెంటర్లు ఏర్పాటు...

ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలు, రాష్ట్రానికి చెందిన పలు కాలేజీలు తెలంగాణలో స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసి అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు నిర్వహిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని, అవి నకిలీ యూనివర్సిటీలు, కాలేజీలేనని రాష్ర్ట ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. వాటిల్లో చదివి మోసపోవద్దని పేర్కొన్నారు. ఈ కోర్సును నిర్వహించే 3 యూనివర్సిటీలు, 8 కాలేజీలకు, వాటి స్టడీసెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం కాని, వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ గుర్తింపునివ్వలేదని, యూజీసీ కూడా వాటికి గుర్తింపు ఇవ్వలేదని వెల్లడించారు.

యూనివర్సిటీలు/ప్రభుత్వం/ యూజీసీ గుర్తింపు లేని కాలేజీల్లో చదివితే నష్టపోవాల్సి వస్తుందని సూచించారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, ఇతర వివరాలను యూజీసీ వెబ్‌సైట్‌లో (ugc.ac.in) పొందవచ్చని వివరించారు.
 
ఇవీ నకిలీ యూనివర్సిటీలు, కాలేజీలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, ఆగ్రా, ఉత్తరప్రదేశ్
సంఘానియా యూనివర్సిటీ, ఝుంఝును రాజస్తాన్
జేఎస్ యూనివర్సిటీ, ఫిరోజాబాద్, ఉత్తరప్రదేశ్
ట్రినిటీ అగ్రికల్చర్ కాలేజీ, అంబేడ్కర్ విగ్రహం ఎదురుగా యాప్రాల్, హైదరాబాద్
ట్రినిటీ అగ్రికల్చర్ అకాడమీ, తూముకుంట, సమ్మర్ గ్రీన్ రిసార్ట్స్ ఎదురుగా, శామీర్‌పేట్, రంగారెడ్డి
గ్రీన్‌లాండ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, సుందర్‌నగర్ కాలనీ, మెయిన్‌రోడ్ సంజీవరెడ్డి నగర్, హైదరాబాద్
⇒  గ్రీన్‌ఫీల్డ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ , సాయినగర్ రోడ్, రాజధాని హోటల్ లేన్ ఎదురుగా, హైదరాబాద్
తెలంగాణ అగ్రికల్చర్  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్ట్రీట్ నెంబర్-2 బిగ్ బజార్ దగ్గర తార్నాక, హైదరాబాద్
మాగ్జిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, నంజిని ఎన్‌క్లేవ్, ప్రశాంత్‌నగర్, ఉప్పల్ పోలీసుస్టేషన్ పక్కన, ఉప్పల్
గ్రీన్ ప్లాంట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, వివేకానందనగర్, కెనరా బ్యాంకు ఎదురుగా, కూకట్‌పల్లి, హైదరాబాద్
అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్, హిల్ కాలనీ, రిలయన్స్ డిజిటల్ ఎదురుగా వనస్థలిపురం, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement