ప్రైవేటు ఆస్పత్రుల్లో యథావిధిగా ఆరోగ్యశ్రీ | The Minister assured that the release assets | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ఆస్పత్రుల్లో యథావిధిగా ఆరోగ్యశ్రీ

Jul 3 2016 12:40 AM | Updated on Sep 4 2017 3:59 AM

ప్రైవేటు ఆస్పత్రుల్లో యథావిధిగా ఆరోగ్యశ్రీ

ప్రైవేటు ఆస్పత్రుల్లో యథావిధిగా ఆరోగ్యశ్రీ

ఆరోగ్యశ్రీ సేవలను యథావిధిగా కొనసాగించేందుకు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు అంగీకరించాయి.

బకాయిల విడుదలకు మంత్రి హామీ
 
 సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ సేవలను యథావిధిగా కొనసాగించేందుకు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు అంగీకరించాయి. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం లేదంటూ ప్రైవేటు ఆస్పత్రులు వైద్య సేవలను నిలిపేసిన విషయం తెలిసిందే. దీంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి శనివారం సచివాలయంలో ఆస్పత్రుల యాజమాన్యాలతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి.

ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలను దశలవారీగా అందజేస్తామని మంత్రి చెప్పారు. ప్రతీ నెల ప్రభుత్వం చెల్లిం చే రూ.40 కోట్లతో పాటు... జూలై నెలకు  అదనంగా మరో రూ.100 కోట్లు విడుదల చేశామ న్నారు. సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement