ఐఐటీల్లో సీట్ల కేటాయింపు | The allocation of seats in the IITs | Sakshi
Sakshi News home page

ఐఐటీల్లో సీట్ల కేటాయింపు

Jun 29 2017 12:38 AM | Updated on Sep 5 2017 2:42 PM

ఐఐటీల్లో సీట్ల కేటాయింపు

ఐఐటీల్లో సీట్ల కేటాయింపు

ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, కేంద్ర ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థల్లో మొదటి దశ ప్రవేశాల్లో భాగంగా సీట్ల కేటాయింపును జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ (జోసా) ప్రకటించింది.

సాక్షి, హైదరాబాద్‌: ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, కేంద్ర ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థల్లో మొదటి దశ ప్రవేశాల్లో భాగంగా సీట్ల కేటాయింపును జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ (జోసా) ప్రకటించింది. సీట్లు పొందిన విద్యార్థులు వచ్చే నెల 3లోగా రిపోర్టు చేయాలని పేర్కొంది. ఆయా కేంద్రాల్లో విద్యార్థులు సీట్‌ యాక్సెప్టెన్స్‌ తప్పనిసరిగా చేయాలని, ఆ తర్వాత సీటు లభించిన కాలేజీలో ఇష్టం లేకపోతే మరో కాలేజీ కోసం రెండో దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని పేర్కొంది. సీట్‌ యాక్సెప్టెన్స్‌ సమయంలో విద్యార్థులు ఒరిజినల్‌ హాల్‌టికెట్‌ను (అడ్మిట్‌ కార్డు) తప్పనిసరిగా అందజేయాలని తెలిపింది.

ఒకవేళ ఒరిజినల్‌ హాల్‌టికెట్‌ పోగొట్టుకుంటే డూప్లికేట్‌ హాల్‌టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ‘ఆర్గనైజింగ్‌ చైర్మన్‌ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2017 పేయబుల్‌ ఎట్‌ చెన్నై’ పేరుతో రూ.1,000 డీడీ తీసి సంబంధిత జోనల్‌ ఐఐటీలో అందజేసి డూప్లికేట్‌ అడ్మిట్‌ కార్డు పొందొచ్చని వివరించింది. ఈసారి ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, జీఎఫ్‌టీఐల్లో తెలంగాణకు చెందిన దాదాపు 3,600 మంది విద్యార్థులకు సీట్లు లభించినట్లు తెలిసింది. ఇందులో ఐఐటీల్లో 1,000 మంది వరకు సీట్లు లభించినట్లు సమాచారం. గతేడాది 3,531 మందికి సీట్లు లభించగా, అందులో ఐఐటీల్లో 931 మందికి, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐలలో 2,600 మందికి సీట్లు లభించాయి.

ఇక ఏపీ నుంచి 3,300 మంది విద్యార్థులకు సీట్లు లభించినట్లు తెలిసింది. గతేడాది ఏపీ విద్యార్థులకు ఐఐటీల్లో 822 మందికి సీట్లు లభించగా, మిగతా విద్యాసంస్థల్లో 2,391 మందికి సీట్లు లభించాయి. టాప్‌ ర్యాంకర్లలో ఎక్కువ మంది విద్యార్థులకు ఐఐటీ బాంబేలో సీట్లు లభించాయి. జాతీయ స్థాయిలో 36,114 మందికి సీట్లు కేటాయించగా, అందులో ఐఐటీల్లో 11 వేల మందికి సీట్లు కేటాయించారు. అందులో 994 మంది బాలికలకు సీట్లు లభించాయి. ఎన్‌ఐటీల్లో 18 వేల మందికి, జీఎఫ్‌టీఐల్లో 3 వేల మందికి సీట్లు లభించాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement