కేసీఆర్ సర్కార్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ ఆరోపించారు.
'అవినీతిలో కేసీఆర్, చంద్రబాబు పోటీ పడుతున్నారు'
Oct 19 2016 3:35 PM | Updated on Sep 22 2018 8:25 PM
హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ ఆరోపించారు. ప్రాజెక్టుల నుంచి చేప పిల్లల పంపిణీ వరకు అంతా అవినీతే అని మండిపడ్డారు. ఆఖరికి సబ్సిడీ ట్రాక్టర్లలోను విచ్చలవిడిగా అవినీతి పాల్పడ్డారన్నారు. అవినీతిలో ఇక్కడ కేసీఆర్, ఏపీలో చంద్రబాబు పోటీ పడుతున్నారని శివకుమార్ తెలిపారు. ఇలాగైతే బంగారు తెలంగాణ సాధ్యం కాదని, బిచ్చమెత్తుకునే తెలంగాణగా మారుందని అభిప్రాయపడ్డారు.
Advertisement
Advertisement