కేసీఆర్కు టీడీపీ నేత ఎల్.రమణ లేఖ | tdp leader L.Ramana Letter to telangana cm kcr over medaram jatara holiday | Sakshi
Sakshi News home page

కేసీఆర్కు టీడీపీ నేత ఎల్.రమణ లేఖ

Feb 13 2016 8:21 PM | Updated on Aug 15 2018 9:30 PM

కేసీఆర్కు టీడీపీ నేత ఎల్.రమణ లేఖ - Sakshi

కేసీఆర్కు టీడీపీ నేత ఎల్.రమణ లేఖ

తెలంగాణ టీడీపీ నేత ఎల్.రమణ శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు లేఖ రాశారు.

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేత ఎల్.రమణ శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు లేఖ రాశారు. మేడారం జాతర సందర్భంగా ఈ నెల 18,19,20 తేదీలను సెలవు దినాలుగా ప్రకటించాలని ఆయన తన లేఖలో విజ్ఞప్తి చేశారు. కాగా దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతికెక్కిన మేడారం జాతరకు కోట్లలో భక్తులు తరలి వెళ్తారు. ఈ నెల 17 నుంచి నాలుగురోజులపాటు జరిగే మేడారం జాతర ఏర్పాట్లు దాదాపు పూర్తయాయి.

ఇక తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వరంగల్ జిల్లా మేడారానికి భక్తజనం క్యూ కడతారు. జాతర మొదలు కాకముందు నుంచే శని, ఆదివారాల్లో లక్షల్లో భక్తులు మేడారం చేరుకుంటున్నారు. ఈనెల 14 నుంచి ఆ సంఖ్య ఎక్కువ కానుంది. ఇక 17, 18 తేదీల్లో అది మరింతగా పెరుగునుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎల్.రమణ మూడు రోజులు సెలవులు ఇవ్వాలని తన లేఖలో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement