టేస్టీ టచ్ | tasty touch | Sakshi
Sakshi News home page

టేస్టీ టచ్

Jan 21 2015 11:54 PM | Updated on Sep 2 2017 8:02 PM

టేస్టీ టచ్

టేస్టీ టచ్

కొత్తటేస్టులెన్ని ఊరిస్తున్నా... పాతెప్పుడూ రుచే. అలాంటి పాత వంటకాలకే కొంచెం కొత్తదనం జోడించి ఆరోగ్యకరమైన డిషెస్ అందిస్తోంది ఉలవచారు రెస్టారెంట్.

కొత్తటేస్టులెన్ని ఊరిస్తున్నా... పాతెప్పుడూ రుచే. అలాంటి పాత వంటకాలకే కొంచెం కొత్తదనం జోడించి ఆరోగ్యకరమైన డిషెస్ అందిస్తోంది ఉలవచారు రెస్టారెంట్. ఆ వంటల స్పెషాలిటీ ఏంటో చూద్దాం...
 
తందూరీ మచ్ఛీ...
చేపను నిప్పుల మీద కాల్చుకుని, దానికింత ఉప్పు కారం తగిలించి తింటే ఆ రుచే వేరు. చేపను ముక్కలుగా చేయకుండా, ఆ ఫ్లేవర్‌ను మిస్ చేయకుండా ఉలవచారు రెస్టారెంట్ వడ్డిస్తున్న కొత్త వంటకం తందూరీ మచ్ఛీ. తందూరీ చికెన్ అందరికీ తెలిసిందే కదా! ఆ తందూరీని ఈ చేపకు చేర్చి వడ్డిస్తారంతే. ఇందులో మస్టర్డ్ పేస్ట్, జీరా పౌడర్, గడ్డ పెరుగు ఉపయోగిస్తుండటంతో ఏ కాలంలో తిన్నా చలువ చేస్తుంది. సీ ఫుడ్ కావడంతో హెల్త్‌కి మంచిది.
 
మ్యాంగో స్ట్రైకీ చికెన్

జీడిపప్పు, మ్యాంగో పేస్టు, మసాలా పొడులతో ఆయిల్ లేకుండా నాన్ స్టిక్ పాన్ మీద చే సే స్పైసీ వంటకం. ఫ్యాట్స్‌తోపాటు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారయ్యే మ్యాంగో స్ట్రైకీ చికెన్ పూర్తిగా హెల్త్ సపోర్టివ్.
 
గద్వాల్ కోడి పలావ్
మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్‌లో ఫేమస్ అయిన రెసిపీ ఇది. ఇప్పుడు నగరవాసులను ఆకట్టుకుంటోంది. చికెన్ బిర్యానీలో బోన్స్ ఉంటాయి... కానీ బోన్‌లెస్ చికెన్‌తో మసాలా లేకుండా కేవలం పెప్పర్ పౌడర్‌తో స్పైసీగా చేసిన హోమ్‌లీ డిష్ ఇది. రిచ్ ఫ్లేవర్‌తో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పలావ్‌లోకి టమాటో లేదా పుదీనా పచ్చడి తోడైతే వావ్ అనాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement