పేద విద్యార్థి ఆత్మహత్య | student's suicide for studies | Sakshi
Sakshi News home page

పేద విద్యార్థి ఆత్మహత్య

Feb 8 2015 8:11 PM | Updated on Nov 6 2018 7:56 PM

హైదరాబాద్ మోతీనగర్ ప్రాంతానికి చెందిన హరీశ్(14) అనే విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్ సిటీ క్రైం: హైదరాబాద్ మోతీనగర్ ప్రాంతానికి చెందిన హరీశ్(14) అనే విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మోతీనగర్‌లోని బొబ్బుగూడకు చెందిన రాజేశ్ నిరుపేద కూలీ. ప్రైవేటు స్కూల్ లో చదివించే అవకాశం లేకపోవటంతో కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాడు. కానీ, ప్రైవేటు ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో చదువుకోవాలన్న కోరిక తీరకపోవటంతో ఆవేదనకు గురై హరీశ్ ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement