జంటనగరాల వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రానున్న మెట్రోరైలు పురోగతిపై తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ అధ్యక్షతన మెట్రోరైల్ స్పెషల్ టాస్క్ఫోర్స్ మంగళవారం చర్చించింది.
జంటనగరాల వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రానున్న మెట్రోరైలు పురోగతిపై తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ అధ్యక్షతన మెట్రోరైల్ స్పెషల్ టాస్క్ఫోర్స్ మంగళవారం చర్చించింది. మొత్తం మూడు ప్రాంతాల్లో మెట్రోరైలు అలైన్మెంటు మార్పుల గురించిన ప్రతిపాదనలు రావడంతో వాటిపై కూడా సమావేశంలో ఎల్ అండ్ టీ ప్రతినిధులు, ఉన్నతాధికారులు చర్చించారు.
అలైన్మెంట్ మార్పు వల్ల మొత్తం ఎంత ఆర్థికభారం పడుతుందోనన్న విషయంపై సీఎస్ రాజీవ్ శర్మ ఓ నివేదిక కోరారు. అలాగే మెట్రోకు అవసరమైన ప్రైవేటు ఆస్తుల సేకరణను వేగవంతం చేయాలని కూడా సీఎస్ ఆదేశించారు.