కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీకి ఫోన్లో బెదిరింపు కాల్స్ వచ్చాయి.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీకి ఫోన్లో బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చంపుతామని బెదిరించాడు. దీనిపై షబ్బీర్ అలీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెదిరింపుకు పాల్పడ్డ వ్యక్తి వివరాలను కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.