బాబు కొత్త నివాసంలో ముగిసిన వ్రతాలు | Prayers finished in the chandrababu new house | Sakshi
Sakshi News home page

బాబు కొత్త నివాసంలో ముగిసిన వ్రతాలు

Apr 11 2017 12:47 AM | Updated on Aug 14 2018 11:26 AM

అర ఎకరం విస్తీర్ణంలో విదేశీ ఇంటీరియర్‌తో విలాసవంతంగా జూబ్లీహిల్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నిర్మించుకున్న నివాసంలో సోమవారం సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించారు.

పూజారుల సెల్‌ఫోన్‌లకూ నో
 
సాక్షి, హైదరాబాద్‌: అర ఎకరం విస్తీర్ణంలో  విదేశీ ఇంటీరియర్‌తో విలాసవంతంగా జూబ్లీహిల్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నిర్మించుకున్న నివాసంలో సోమవారం సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించారు. చంద్రబాబు, లోకేశ్‌లు సతీసమేతంగా వ్రతంలో పాల్గొన్నారు. ఈ వేడుకలకు కొద్దిమంమే హాజరయ్యారు.  సీఎం వియ్యంకుడు నందమూరి బాల కృష్ణ దంపతులతో పాటు ఎంపీ సీఎం రమేశ్‌ తదితరులున్నారు.

గృహ ప్రవేశాన్ని  గుట్టుగా నిర్వహించిన బాబు.. తన ఇంటి చుట్టూ ఏర్పాటు చేసుకున్న సీసీ కెమేరాల్లో ప్రతీ అంశాన్ని రికార్డు అయ్యేలా చూశారు. వ్రతం సందర్భంగా వివిధ పనుల కోసం ఇంట్లోకి వచ్చే వారి సెల్‌ఫోన్‌లను సెక్యూరిటీ సిబ్బంది స్వాధీనం చేసుకు న్నారు. లోపల ఫొటోలు తీస్తారేమోననే అనుమానంతో క్షుణ్ణంగా మెటల్‌ డిటెక్టర్‌లతో తనిఖీలు చేశాకే లోపలికి అనుమతించారు. వ్రతం నిర్వహించిన పూజారులకు కూడా సెల్‌ఫోన్‌లను అనుమతించలేదు. జూబ్లీహిల్స్‌ పోలీసులను కూడా ఇంటి పరిసరాల్లోకి అనుమతించకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement