పాజిబుల్ ఎఫెక్ట్స్ | possible effects | Sakshi
Sakshi News home page

పాజిబుల్ ఎఫెక్ట్స్

Feb 4 2015 12:09 AM | Updated on Sep 2 2017 8:44 PM

పాజిబుల్ ఎఫెక్ట్స్

పాజిబుల్ ఎఫెక్ట్స్

బయటేదో పది నిమిషాల పనుందనుకోండి... గదిలో ఫ్యాన్ ఆపకుండా వెళ్లిపోతుంటాం. కాసేపే కదా అనేది మన ఆలోచన. ఇలా అందరూ ఆలోచిస్తే ఎంత విద్యుత్ వృథా అవుతుంది! కరెంటే కాదు...

 బయటేదో పది నిమిషాల పనుందనుకోండి... గదిలో ఫ్యాన్ ఆపకుండా వెళ్లిపోతుంటాం. కాసేపే కదా అనేది మన ఆలోచన. ఇలా అందరూ ఆలోచిస్తే ఎంత విద్యుత్ వృథా అవుతుంది! కరెంటే కాదు... అన్ని వనరుల వినియోగంలో చాలామంది ఆలోచనా ధోరణి ఇదే. అలా కాకుండా ఎవరికి వారు ఈ వృథాను ఆపితే ఎంతో ఆదా అవుతుందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నాయి మనోహర్ చిలువేరు చిత్రాలు.
 
 ఇవే కాదు.. కుటుంబంలో తలెత్తే చిన్న చిన్న మనస్పర్థలు... అనుబంధాలు, పిల్లలపై ఎంతలా ప్రభావం చూపుతున్నాయో... అందరూ కలసి పాజిటివ్ థింకింగ్‌తో ముందుకు వెళితే ఎంత ప్రయోజనం ఉంటుందో పెయింటింగ్స్‌లో చూపారు ఆయన. ట్యాంక్‌బండ్ హోటల్ మారియట్ మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో మనోహర్ మలచిన చిత్రాలు, వ్యర్థాలతో చేసిన కళాఖండాల ఎగ్జిబిషన్ ‘పాజిబుల్ ఎఫెక్ట్స్’ కళాభిమానుల ప్రశంసలు అందుకుంటోంది.
 ఈ సందర్భంగా ‘సిటీ ప్లస్’ ఆయనను పలకరించింది...
 
 రోజువారి జీవితంలో తెలిసి మరీ చిన్న చిన్న విషయాలే కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటాం. ఇంట్లో కరెంటు కానివ్వండి... బైక్‌లో ఇంధనం కానివ్వండి. మన ఒక్కరి వల్ల ఈ పర్యావరణానికి వచ్చిన ముప్పేమీ లేదనుకోవడంతో మనకు తెలియకుండానే పర్యావరణ కాలుష్యానికి కారకులమవుతున్నాం. అలాగే కుటుంబ కలహాలు కూడా. కొంచెం కాంప్రమైజ్ అయితే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి. న్యూక్లియర్ రియాక్టర్ ద్వారా జరిగే విధ్వంసం కన్నా పర్యావరణ కాలుష్యం వల్ల కలిగేదే ఎక్కువ. రోజూ భూమికి, మానవులకు మధ్య నిశ్శబ్ద యుద్ధం సాగుతోంది. విరుద్ధ ప్రక్రియలతో భూమిని విధ్వంసం చేసే పనిలో మనుషులు పడ్డారు. పట్టనట్టు వ్యవహరిస్తున్న మనిషి ఇది తెలుసుకుంటే ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుంది. అణు బాంబుకన్నా అశ్రద్ధ ప్రమాదరకరమైనది. ఇలా ఇవన్నీ నా చిత్రాల్లో చూపా.  
 
 గ్రామీణ ప్రాంతాలకూ...
 మాటల్లో చెప్పడం కన్నా నాకు వచ్చిన ఆర్ట్ ద్వారా చెబితే త్వరగా ప్రజలను చేరుతుంది. ఇప్పటివరకు వివిధ అంశాలపై ఎన్నో బొమ్మలు గీశా. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బస్సు యాత్ర ద్వారా ఈ ఆర్ట్ సందేశాన్ని గ్రామీణ ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నా. ఈ నెలాఖరులో కేరళలో, అక్టోబర్ ఇటలీలో జరిగే ఫ్లోరెన్స్ ఆర్ట్ బై నాలాజీలోనూ ఈ చిత్ర ప్రదర్శన చేసేందుకు అనుమతి వచ్చింది. వరంగల్‌లో పుట్టిన నాకు పుస్తక పఠనమంటే ఇష్టం. నాకు తెలియకుండానే నేను ఎన్నో విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించా. ఆ విధానాన్ని మార్చుకోవడంలో సక్సెస్ సాధించగలిగా. అలాగే ఎంతో చరిత్ర ఉన్న తెలంగాణ బోనాల విశిష్టతను ప్రపం వ్యాప్తం చేయాలనుకుంటున్నా. దేనికైనా ‘బ్యాలెన్స్’ ముఖ్యం. బోనాలను నెత్తిన పెట్టుకున్న మహిళలు ఎంతో బ్యాలెన్స్‌తో
 
 సాగిపోతుంటారు. ప్రయాణం సాఫీగా సాగాలంటే బ్యాలెన్స్ అవసరమనే కాన్సెప్ట్‌తో మహిళలు బోనాలెత్తిన పెయింటింగ్ రూపొందించా. దీన్ని ఇటలీలో ప్రదర్శిస్తా. వరంగల్‌లో ఎక్కువ మంది ఆర్టిస్టులున్నారు. వారి కోసం అక్కడ ‘ఆర్‌‌ట రెసిడెన్సీ’ ఏర్పాటు చేస్తున్నా. విదేశీ ఆర్టిస్టులు ఇక్కడికి వచ్చి తమ చిత్రాలు ప్రదర్శిస్తారు. స్థానిక కళాకారులతో ముచ్చటిస్తారు. తద్వారా గ్రామాల్లో కళలపై మరింత అవగాహన పెరుగుతుంది. ఈ ఆర్ట్ షో ఈ నెల 7 వరకు కొనసాగుతుంది.
వాంకె శ్రీనివాస్


‘పీకే’ సూపర్‌హిట్ ఉత్సాహం, బాయ్‌ఫ్రెండ్ విరాట్ కొహ్లీతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ఇప్పటివరకు మునిగి తేలిన ముద్దుగుమ్మ అనుష్కాశర్మ మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. రణబీర్‌కపూర్‌తో కలసి ఈ భామ చేస్తున్న తాజా చిత్రం ‘బాంబే వెల్వెట్ క్లబ్’ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కారణం... లేటెస్ట్‌గా రిలీజైన్ అనుష్కా ‘ఫస్ట్ లుక్’. సెవెన్టీస్‌లో బ్లాక్ అండ్ వైట్ చిత్రం పోస్టర్‌లా ఉన్న అనుష్క డిఫరెంట్‌గా కనిపిస్తోంది. ఇందులో అమ్మడి క్యారెక్టర్ పేరు రోజీ. బాంబే వెల్వెట్ క్లబ్‌లో సింగర్. ఆమె లవర్ రోల్ రణబీర్ చేస్తున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement