అధికారి వేధింపులతో ఆత్మహత్యాయత్నం | person committed suicide With abuse of authority | Sakshi
Sakshi News home page

అధికారి వేధింపులతో ఆత్మహత్యాయత్నం

Oct 5 2016 10:51 AM | Updated on Nov 6 2018 7:56 PM

ఉన్నతాధికారి వేధింపులు మితిమీరి పోయాయంటూ ఓ ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడు.

ఉన్నతాధికారి వేధింపులు మితిమీరి పోయాయంటూ ఓ ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడు. మల్కాజిగిరి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మున్సిపల్ కార్యాలయం ఎంటమాలజీ విభాగం అధికారి సింథియా తమను అకారణంగా వేధిస్తున్నారంటూ ఉద్యోగులు తమ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఓ ఉద్యోగి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు ఆర్పిన తోటి వారు తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అసిస్టెంట్ ఎంటమాలజీ ఆఫీసర్ సింథియాను వెంటనే విధుల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. గతంలో కూడా శివకుమార్ అనే ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడని వారు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement