అభివృద్ధిలో భాగస్వాములు కావాలి | Partners in the development of needs :- State IT Minister KT Rama Rao | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

May 1 2016 12:39 AM | Updated on Sep 3 2017 11:07 PM

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఈ లక్ష్య సాధనకు మీడియా

సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఈ లక్ష్య సాధనకు మీడి యా సహకారం అవసరమని రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీ రామారావు అన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి సాంస్కృతిక, వారసత్వం, రియల్ ఎస్టేట్ అంశాలపై ప్రత్యేకంగా నెట్‌వర్క్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన ‘ దక్కన్ ప్రైడ్ ఆంగ్ల పక్షపత్రిక , దక్కన్ ప్రైడ్. కామ్ వెబ్ పోర్టల్‌ను ఆయన సచివాలయంలోని తన చాంబర్‌లో శనివారం ప్రారంభించారు.

హైదరాబాద్ నగర అభివృద్ధి, సమస్యలు, సాంస్కృతి వార్తలకు మీడియా మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జర్నలిస్టు నేతలు అమర్, నరేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, నర్సింహారెడ్డి, సత్యనారాయణ, మాజిద్, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement