హైదరాబాద్‌కు భూకంప ప్రభావం లేదు | No earthquake effect on Hyderabad, says pradeep kumar | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు భూకంప ప్రభావం లేదు

Apr 25 2015 11:26 PM | Updated on Oct 20 2018 6:37 PM

హైదరాబాద్‌కు భూకంప ప్రభావం లేదు - Sakshi

హైదరాబాద్‌కు భూకంప ప్రభావం లేదు

భూకంపాల ప్రభావం హైదరాబాద్ నగరంపై అంతగా ఉండదని ట్రిపుల్‌ ఐటీ ఎర్త్‌క్వేక్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ (ఈఈఆర్‌సీ) హెడ్ ప్రొఫెసర్ ప్రదీప్‌కుమార్ రామన్ చర్ల తెలిపారు.

హైదరాబాద్ : భూకంపాల ప్రభావం హైదరాబాద్ నగరంపై అంతగా ఉండదని ట్రిపుల్‌ ఐటీ ఎర్త్‌క్వేక్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ (ఈఈఆర్‌సీ) హెడ్ ప్రొఫెసర్ ప్రదీప్‌కుమార్ రామన్ చర్ల తెలిపారు. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలో ఆయన శనివారం సాక్షితో మాట్లాడారు. భూకంపంపై అంతగా భయపడాల్సిన అవసరం లేకపోయినా... నగరంలో ఇళ్ల నిర్మాణం విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలని ఆయన నగరవాసులకు సూచించారు. విపత్తులను తట్టుకునే రీతిలో కట్టడాలను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. భూకంపాలపై అవగాహన కల్పించేందుకు ఈఈఆర్‌సీ ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు చిన్న పుస్తకాలు, కరపత్రాలను పంపిణీ చేశామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement