విదేశాలకు వెళ్లోచ్చే సరికి.. ఇల్లు ఖాళీ | Massive theft in Hyderabad | Sakshi
Sakshi News home page

విదేశాలకు వెళ్లోచ్చే సరికి.. ఇల్లు ఖాళీ

Nov 24 2015 5:58 PM | Updated on Sep 4 2018 5:07 PM

విదేశాలకు తిరిగి వెళ్లి వచ్చేసరికి.. ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు, నగదు చోరీ జరిగిన ఘనట బోయన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.

విదేశాలకు తిరిగి వెళ్లి వచ్చేసరికి.. ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు, నగదు చోరీ జరిగిన ఘనట బోయన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక సిఖ్ విలేజ్ లోని కార్తీక్ ఎన్క్లేవ్ లో నివాసం ఉంటున్న మోహన్ కనోడియా 15 రోజుల క్రితం జర్మనీకి వెళ్లారు. సోమవారం తెల్లవారు ఝామున తిరిగి ఇంటికి చేరుకున్నారు.

ఇంటికి వచ్చే సరికి తలుపులు, కిటికీ రెక్కలతో పాటు.. ఇంట్లోని బీరువా తలుపులు విరిగి కనిపించాయి. లోపలికి వెల్లి చూడగా.. బీరువాలో దాచిన బంగారు ఆభరణాలతో పాటు.. 76 గ్రాముల వెండి నాణేలు, లక్షన్నర నగదు, తొమ్మిది వాచీలు గుర్తుతెలియని అగంతకులు చోరీ చేశారు. కాగా ఇంటికి వాచ్ మెన్ గా బహదూర్ అనే వ్యక్తిని కాపలాగా ఏర్పాటు చేశానని.. అతను కనిపించడం లేదని ఇంటి యజమాని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement