ఒథెల్లో నాటకాన్ని ఈనెల 24న రవీంద్రభారతిలో ప్రదర్శించనున్నారు.
ప్రముఖ రచయిత విలియమ్ షేక్స్ స్పియర్ రాచించిన ఒథేలో నాటకాన్ని ఆడాప్ట్ చేసుకొని దాన్ని పూర్తి తెలంగాణ భాషలో ఈ ప్రాంత ప్రజల కష్టాలు పెందుపరిచి ‘కర్రిగాడు పేరుతో నాటకాన్ని ప్రద ర్శిస్తున్నట్లు నిశుంభుతి బ్యాలెట్ అండ్ థియేటర్ గ్రూఫ్ నిర్వాహకులు తెలిపారు. సోమవారం రవీంద్రభారతిలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. నీటి కోసం పడుతున్న కష్టాలతో పాటు కర్రిగాడి ప్రేమ గాథ సన్నివేశాలతో నాటకం సాగుతుందని తెలిపారు. 24 న రాత్రి 7.30కి రవీంద్రభారతిలో ప్రద ర్శిస్తున్నట్లు చెప్పారు.