ఆక్రమణల ‘దుర్గం’ | illegal constructions in durgam cheruvu | Sakshi
Sakshi News home page

ఆక్రమణల ‘దుర్గం’

Sep 26 2016 2:52 AM | Updated on Aug 18 2018 8:37 PM

మాదాపూర్‌లోని దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లోని నెక్టార్ గార్డెన్ - Sakshi

మాదాపూర్‌లోని దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లోని నెక్టార్ గార్డెన్

నగరం నడిబొడ్డున అత్యంత ఖరీదైన ప్రాంతం.. చుట్టూ అత్యంత సుందరమైన ఐటీ కారిడార్.

35 ఎకరాల్లో వెలసిన లే-అవుట్లు
పెద్దల ఒత్తిడితో రెండు రోజులుగా నీరు విడుదల
పరిరక్షణపై శ్రద్ధ చూపని ప్రభుత్వం

హైదరాబాద్: నగరం నడిబొడ్డున అత్యంత ఖరీదైన ప్రాంతం... చుట్టూ అత్యంత సుందరమైన ఐటీ కారిడార్. ఆ భూమిపై పెద్దల కన్ను పడింది. పదుల ఎకరాల్లో లే అవుట్లు, అపార్ట్‌మెంట్లు వెలిశాయి. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. అధికారులు మామూళ్ల గం తలు కట్టుకోగా.. ప్రభుత్వం పెద్దలకే వంత పాడింది. చెరువులను పునరుద్ధరిస్తాం అంటూ వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఈ ఆక్రమణలను చూసీచూడనట్లే వదిలేస్తోంది. దీంతో రోజురోజుకు చెరువు కుంచించుకుపోతోంది. ఇదీ కబ్జా కోరల్లో చిక్కుకున్న దుర్గం చెరువు దుస్థితి.

ఐటీ కారిడార్‌లో సుందర తటాకమైన దుర్గం చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుంది. వేలాది ఎకరాలు కబ్జాకు గురైనా గత ప్రభుత్వాలు తలెత్తి అటు వైపు చూడలేదు. మిషన్ కాకతీయ పేరిట చెరువుల సంరక్షణకు పెద్దపీట వేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా దుర్గం చెరువు పరిరక్షణలో పెద్దగా శ్రద్ధ చూపడం లేదనే విమర్శలున్నారుు. మాదాపూర్‌లోని దుర్గం చెరువు 160 ఎకరాలలో విస్తరించి ఉంది. మాదాపూర్ సర్వే నంబర్ 61లోనే దాదాపు 90 ఎకరాలు. రాయదుర్గం, గుట్టల బేగంపేట పరిధిలో మరో 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రెండు గుట్టల మధ్యలో ఉన్న దుర్గం చెరువు సుందర తటాకంగా నిలుస్తూ పర్యాటకులకు ఆహ్లాదం పంచుతోంది.

35 ఎకరాలు కబ్జా...: దుర్గం చెరువు ప్రస్తుతం కేవలం 125 ఎకరాల విస్తీర్ణంలోనే ఉంది. దాదాపు 35 ఎకరాలు కబ్జాకు గురైంది. ఇనార్భిట్‌మాల్ నుంచి కావూరి హిల్స్‌కు వెళ్లే రోడ్డు ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్‌టీఎల్) పరిధిలోకి వస్తుంది. అంతేకాదు వందలాది నిర్మాణాలు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉన్నాయి. నెక్టార్ గార్డెన్‌తో పాటు, అమర్‌సొసైటీ, కావరి హిల్స్, సెలైంట్ వ్యాలీలోని కొంత భాగం దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోకే వస్తారుు.  దాదాపు 35 ఎకరాల్లో అపార్ట్‌మెంట్లు వెలిశారుు. నెక్టార్ గార్డెన్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాబుమోహన్ నివాసం ఉంటున్నారు. అంతే కాకుండా దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే సినీ, రాజకీయ ప్రముఖులు ఉండటం గమనార్హం.

దిగువకు నీరు విడుదల..
భారీ వర్షాలు వచ్చినా దుర్గం చెరువు పూర్తిగా నిండడం గగనమే. అలాంటిది పూర్తి స్థారుు మట్టానికి పది అడుగుల ఉండగానే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎఫ్‌టీఎల్‌లోని సెలైంట్ వ్యాలీ నివాసితులు రెండు రోజులుగా ఇరిగేషన్ అధికారులకు ఫోన్లు చేసి నీళ్లు కిందికి వదలాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజులుగా నీటిని విడుదల చేస్తున్నారు.

గతంలోనూ ఒత్తిళ్లు..
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దుర్గం చెరువు గేట్లు మూరుుంచారు. దీంతో దుర్గం చెరువు గేట్ ముందు ఉన్న అపార్ట్‌మెంట్లు, ఇళ్లలోకి నీళ్లు వచ్చారుు. నెక్టార్ గార్డెన్‌లోకి నీళ్లు రావడంతో స్వయంగా బాబుమోహన్ రంగంలోకి దిగి నీటిని కిందికి విడుదల చేరుుంచారు.

దుర్గం చెరువు మొత్తం విస్తీర్ణం: 160 ఎకరాలు
ప్రస్తుతం ఉన్న విస్తీర్ణం : 125 ఎకరాలు
కబ్జాకు గురైంది : 35 ఎకరాలు
ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు: నెక్టార్ గార్డెన్, అమర్‌సొసైటీ, కావూరి హిల్స్, సెలైంట్ వ్యాలీలోని కొంత భాగం

దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లో వెలసిన నిర్మాణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement