రేపు హెచ్‌ఎండీఏ పరిధిలో హరితహారం | Harithaharam programme to be held HMDA tomorrow | Sakshi
Sakshi News home page

రేపు హెచ్‌ఎండీఏ పరిధిలో హరితహారం

Jul 10 2016 2:41 AM | Updated on Sep 4 2017 4:29 AM

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11న హెచ్‌ఎండీఏ పరిధిలో ఒకేరోజు 25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11న హెచ్‌ఎండీఏ పరిధిలో ఒకేరోజు 25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. విద్యార్థుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు, పాఠశాలల నుంచి కార్పొరే ట్ సంస్థల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
 
 శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, హైదరాబాద్ నగరాన్ని నందన వనంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ఈ భారీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఈ మహాకార్యంలో ప్రజలంతా పాలుపంచుకోవాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కనీసం ఒక మొక్క నాటాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement