
గురుకుల పరీక్షల షెడ్యూలు జారీ
న్యాయ వివాదాలతో ఇటీవల ఆగిపోయిన గురుకులాల్లోని వివిధ పోస్టుల రాత పరీక్షల తేదీలను (రివైజ్డ్ షెడ్యూలు) టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది
తాజాగా కోర్టు స్టే ఎత్తివేయడంతో పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టింది. ఈ నెల 27, 28 తేదీల్లో పీజీటీ లాంగ్వేజెస్ పోస్టులకు, సెప్టెంబర్ 3, 4 తేదీల్లో టీజీటీ పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించేలా గతంలో జారీ చేసిన షెడ్యూలు ప్రకారం రాత పరీక్షలు ఉంటాయని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
