breaking news
Vaniprasad
-
గురుకుల పరీక్షల షెడ్యూలు జారీ
సాక్షి, హైదరాబాద్: న్యాయ వివాదాలతో ఇటీవల ఆగిపోయిన గురుకులాల్లోని వివిధ పోస్టుల రాత పరీక్షల తేదీలను (రివైజ్డ్ షెడ్యూలు) టీఎస్పీఎస్సీ ప్రకటించింది. కోర్టు వివాదం తాత్కాలికంగా సమసిపోవడం, పరీక్షల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ లభించడంతో తాజా షెడ్యూలును జారీ చేసింది. గురుకులాల్లో పోస్టులను మహిళలకే కేటాయించడాన్సి సవాలు చేస్తూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించడంతో పరీక్షలు ఆగిపోయాయి. తాజాగా కోర్టు స్టే ఎత్తివేయడంతో పరీక్షల నిర్వహణకు టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. ఈ నెల 27, 28 తేదీల్లో పీజీటీ లాంగ్వేజెస్ పోస్టులకు, సెప్టెంబర్ 3, 4 తేదీల్లో టీజీటీ పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించేలా గతంలో జారీ చేసిన షెడ్యూలు ప్రకారం రాత పరీక్షలు ఉంటాయని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇదేం పద్ధతి?
నల్లగొండ టూటౌన్: ‘కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించరా..?, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించరా..?, విధుల్లో బాధ్యతారాహిత్యం పనికిరాదు’ అంటూ తెలంగాణ కమిషనరేట్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎ.వాణీప్రసాద్ ఘాటుగా స్పందించారు. శుక్రవారం ఎన్జీ కళాశాలలో జరిగిన గవర్నింగ్ బాడీ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాల అకాడమిక్ సంబంధించిన షెడ్యూల్‌ను, ఆర్థిక వివరాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... విద్యార్థులకు సరైన విద్యను అందించకపోతే ఎలా అని అధ్యాపకులను ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి వేలాది రూపాయలు జీతాలు తీసుకుంటూ విద్యార్థులకు సరైన బోధన చేయకపోతే సహించేదిలేదని హెచ్చరించారు. కళాశాలలో మంచి వాతావరణాన్ని కల్పించాలని, ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని సూచించారు. తాను గతంలో తనిఖీ చేసిన సమయంలో ఇక్కడి సమస్యలను ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. అదేవిధంగా కొత్త కోర్సులు, కళాశాల సమస్యలపై చర్చించారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.నాగేందర్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ వి.శ్రీనివాస్‌రెడ్డి, ఏడుకొండల్, దయాకర్ పాల్గొన్నారు.