ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం | Formation of a grand ysrcp Day | Sakshi
Sakshi News home page

ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం

Mar 13 2015 12:19 AM | Updated on Jul 7 2018 2:56 PM

ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం - Sakshi

ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణలోని ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేసే చేవెళ్ళ-ప్రాణహిత ప్రాజెక్టు ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని, .0...

వైఎస్ వల్లే తెలంగాణలో సాగు నీటి ప్రాజెక్టులు
 
‘ప్రాణహిత’ పూర్తయితే వైఎస్ పేరు శాశ్వతంగా నిలుస్తుంది
దురుద్దేశంతోనే ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం
వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి

 
చందానగర్ :తెలంగాణలోని ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేసే చేవెళ్ళ-ప్రాణహిత ప్రాజెక్టు ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని, ఈ ప్రాజెక్టు పూర్తయితే వైఎస్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవ రెడ్డి అన్నారు. ఎంతో అద్భుతమైన ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని ఆయన దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురష్కరించుకొని రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ధనలక్ష్మీ ఆధ్వర్యంలో చందానగర్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా హాజరైన కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో 23 ప్రాజెక్టులకు వైఎస్సార్ అనుమతులు తీసుకొని 16 ప్రాజెక్టులు పూర్తి చేశారన్నారు. మిగతా 7 ప్రాజెక్టులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించి పూర్తి చేయడం లేదన్నారు.

ప్రాణహిత ప్రాజెక్టుతో పాటు మిగాతా ప్రాజెక్టులు పూర్తయితే వైఎస్సార్ పేరు తెలంగాణలో శాశ్వతంగా నిలిచిపోతుందని దురుద్దేశంతోనే టీఆర్‌ఎస్ ఇలాంటి చర్యలకు పూనుకుందని ఆరోపించారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో శేరిలింగంపల్లిలోని 6 డివిజన్‌లలో పార్టీ జెండా ఎగరవేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యశ్రీరంగం, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి, పార్టీ జిల్లా పరిశీలకులు శివకుమార్, సహాయ పరిశీలకులు పిట్ట రాంరెడ్డి, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు సైయ్యద్ ముస్తాబా అహ్మద్, కార్యవర్గ సభ్యులు బ్రహ్మానందరెడ్డి, కుసుమ కుమార్‌రెడ్డి, హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు శ్యామల, 114,112 డివిజన్‌ల కన్వీనర్లు భవానీ చౌదరి, ఇమామ్ హుసేన్, రాష్ట్ర నాయకులు సందీప్‌కుమార్, స్థానిక నాయకులు మహేశ్వర్‌రెడ్డి, నారాయణ, మురళి తదితరులు పాల్గొన్నారు.
 
సిటీబ్యూరో: నగరంలో గురువారం వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాలన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలనుద్దేశించి ప్రసంగించారు. పార్టీ నేతలు, కార్యకర్తల్ని ఉత్సాహపరిచారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇక కుత్భుల్లాపూర్ నియోజకవర్గం 129వ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గుడిమెట్ల సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావదినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గృహకల్ప అధ్యక్షుడు శివగౌడ్ తదితరలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రంగారెడ్డి జిల్లా కో- అబ్జర్వర్ పిట్టా రామిరెడ్డి, స్టేట్ జనరల్ సెక్రటరీలు జి.రాంభూపాల్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, జాయింట్ సెక్రటరీలు ఇరుగు సునీల్ కుమార్, గూడూరు జయపాల్‌రెడ్డి, బంగి లక్ష్మణ్, ఎస్. హరినాథరెడ్డి, పార్టీ డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, సేవాదళ్ అధ్యక్షుడు వెల్లాల రాంమోహన్, మైనార్టీ నేతలు మతిన్, ముజ్తుబా అహ్మద్, పార్టీ నేతలు పుత్తా ప్రతాప్‌రెడ్డి, కేసరి సాగర్, నల్లా సూర్యప్రకాష్, మల్లాది సందీప్ కుమార్, మహిళ నేతలు క్రిస్టోలైట్, అమృతసాగర్, పార్టీనేతలు జార్జ్ హెర్భట్, పి.సిద్దార్థరెడ్డి, విద్యార్థి నాయకులు సలాం బాబు తదితరులు  వేడుకల్లో పాల్గొన్నారు.
 
ఐటీ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక ఐపాడ్‌ల పంపిణీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో గురువారం బుద్ధిమాంద్య విద్యార్థులకు ప్రత్యేక ఐపాడ్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్,  ఐటీ విభాగం అధ్యక్షకార్యదర్శులు చల్లా మధుసూదన్‌రెడ్డి, గిరిధర్, మేడపాటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
 
పార్టీ బలోపేతానికి కృషి
 
కుత్బుల్లాపూర్: రంగారెడ్డి జిల్లో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి అన్నారు. గురువారం సూరారం కృషి కాలనీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో త్వరలోనే కమిటీలు వేస్తామన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement