నక్సల్స్ పేరుతో బెదిరింపులు: ఒకరి అరెస్ట్ | 'Fake' Naxal Held for Threatening man for Money | Sakshi
Sakshi News home page

నక్సల్స్ పేరుతో బెదిరింపులు: ఒకరి అరెస్ట్

Sep 20 2016 5:29 PM | Updated on Aug 28 2018 7:22 PM

నక్సల్స్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరూర్‌నగర్ గ్రీన్‌పార్కు కాలనీకి నివాసి రత్లావత్ శేఖర్(39) తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు పథకం పన్నాడు.

హైదరాబాద్: నక్సల్స్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరూర్‌నగర్ గ్రీన్‌పార్కు కాలనీకి నివాసి రత్లావత్ శేఖర్(39) తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు పథకం పన్నాడు. ఇందులో భాగంగా గత కొంతకాలంగా తాను జనశక్తి గ్రూప్ నేత జగన్నంటూ పీఎన్‌ఆర్ ఫార్మసీ కళాశాల సెక్రటరీగా పనిచేస్తున్న నరేందర్‌ రెడ్డిని బెదిరించాడు.

వెంటనే రూ.15 లక్షలు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తానని నగరంలోని వేర్వేరు చోట్ల నుంచి కాయిన్ బాక్స్‌ల ద్వారా ఫోన్ చేస్తున్నాడు. దీనిపై బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు రంగంలోకి దిగారు. కాయిన్ బాక్స్‌ల వద్ద కాపు కాసి శేఖర్‌ను మంగళవారం అదుపులోకి తీసుకుని మీర్‌పేట్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement