
విద్యాశాఖ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలి: సీపీఎం
తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం క్లాసులు నడుపుతున్న ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం క్లాసులు నడుపుతున్న ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను రద్దుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం డిమాండ్ చేసింది. ప్రభుత్వ విద్యను దెబ్బతీసి ప్రైవేట్ విద్యావ్యాపారాన్ని ప్రోత్సహించే విద్యాశాఖ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నడుస్తున్న ఇంగ్లిష్ మీడియం క్లాసులకు అనుమతినిస్తూ ప్రభుత్వం వెంటనే ఆదేశాలివ్వాలని పేర్కొన్నారు.