రిజర్వేషన్ల అమల్లో జాప్యం వద్దు | Do not delay implementation of reservations | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్ల అమల్లో జాప్యం వద్దు

Apr 17 2017 1:25 AM | Updated on Mar 18 2019 9:02 PM

రిజర్వేషన్ల అమల్లో జాప్యం వద్దు - Sakshi

రిజర్వేషన్ల అమల్లో జాప్యం వద్దు

రిజర్వేషన్ల పెంపు బిల్లులు అసెంబ్లీ, కౌన్సిల్‌ ఆమోదం పొందాక, కేసులు,

కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ
సాక్షి, హైదరాబాద్‌: రిజర్వేషన్ల పెంపు బిల్లులు అసెంబ్లీ, కౌన్సిల్‌ ఆమోదం పొందాక, కేసులు, ఇతరత్రా సమస్యల పేరిట వాటి అమల్లో జాప్యం జరగకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాసనమండలిలో విపక్ష నేత మహ్మద్‌అలీ షబ్బీర్‌ సూచించారు. ముస్లింల రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి సుధీర్‌ కమిటీ 9 శాతం, బీసీ కమిషన్‌ 10 శాతానికి పెంచాలని చేసిన సూచనల్లో అంతరాల్లో కారణంగా ఇబ్బందులు తలెత్తే  పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు.

ఆదివారం కౌన్సిల్‌లో రిజర్వేషన్ల బిల్లుపై జరిగిన చర్చలో షబ్బీర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జనాభా 90 శాతం ఉందని సీఎం కేసీఆర్‌ చెబుతున్నారని, అలాంటప్పుడు సుధీర్‌ కమిటీ, బీసీ కమిషన్‌ల బదులు జ్యుడీషియల్‌ కమిషన్‌ను వేయాల్సి ఉండిందన్నారు. ఎస్టీలకు 10 శాతం, వెనుకబాటుతనం ఆధారంగా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల కల్పనను 9వ షెడ్యూ ల్‌లో చేర్చడానికి ముందుగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్ల పెంపును ఒకేసారి 9వ షెడ్యూల్‌లో చేర్చే విధంగా చర్యలు తీసుకుంటే బావుంటుందని సూచించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లపై బీజేపీ నేతలు కోర్టుకు పోతామం టున్నారని, కాబట్టి బిల్లు అమలులో ఆటంకాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసు కోవాలన్నారు. రిజర్వేషన్ల బిల్లు విషయంలో ప్రభుత్వానికి కాంగ్రెస్‌ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు.  ఇది వంద శాతం ముస్లిం రిజర్వేషన్ల బిల్లు కాదని, కమిటీలు, కమిషన్లు ఏ సూచనలు చేసినా అంతకు మించి ప్రభుత్వాలు చేసు కునే అవకాశం ఉందని సీఎం కేసీఆర్‌ సమాధానమిచ్చారు.

సమగ్ర సర్వే వివరాల ప్రకారమే ముస్లింల జనాభా రాష్ట్రంలో 14 శాతం ఉందన్నారు. షబ్బీర్‌ అలీ తెలివైన వారని, అయితే తాను కూడా తెలివైన వాడినేనని పెద్ద లాయర్లను పెట్టి ఈ అంశంపై పరిశీలన జరిపామన్నారు. ముందుగా కేంద్రం వైఖరి స్పష్టమయ్యాక తదుపరి చర్యలు తీసుకోవచ్చన్నారు. రాదనుకున్న తెలంగాణను సాధించామని, దేవుడు అను గ్రహిస్తే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కూడా సాధిస్తామనే విశ్వాసాన్ని సీఎం వ్యక్తం చేశారు.

ముస్లిం రిజర్వేషన్ల పెంపునకు వ్యతిరేకంగా గతంలో కాంగ్రెస్‌ ప్రభు త్వంపై ఇటు హైకోర్టులో, అటు సుప్రీంకోర్టులో వాదించిన రామకృష్ణారెడ్డి ఇప్పుడు ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌గా ఉన్నారని షబ్బీర్‌అలీ వ్యాఖ్యానించారు. దీనికి వ్యతిరే కంగా పోరాడిన వారే మన లాయర్‌ అయ్యారంటే అంతకంటే కావాల్సింది ఏముం దని, ఏజీపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని కేసీఆర్‌ కోరారు. ఆ తర్వాత కౌన్సిల్‌ చైర్మన్‌ ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement