
శాంతిభద్రతలపై రాజీ లేదు
సైబరాబాద్ వెస్ట్ కమిషనర్‌గా నవీన్ చంద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
సైబరాబాద్ వెస్ట్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన నవీన్‌చంద్
సిటీబ్యూరో: సైబరాబాద్ వెస్ట్ కమిషనర్‌గా నవీన్ చంద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ...శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ఎఫెక్టివ్ పోలీసింగ్‌తో ప్రజలకు మరింత చేరువ అవుతామని చెప్పారు.
నేరగాళ్లను వదలబోమని హెచ్చరించారు. కాగా శంషాబాద్ జోన్, మాదాపూర్ జోన్, బాలానగర్ జోన్లలో జరిగే కేసులు, పాలనపరమైన అంశాలను సిబ్బంది ఇక సైబరాబాద్ వెస్ట్ కమిషనర్‌కు రిపోర్టు చేస్తారు. ఇదిలావుండగా సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్ కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ ఒకటి రెండురోజుల్లో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.