త్వరలో హైకోర్టును ఆశ్రయిస్తా: కోమటిరెడ్డి | congress mla komatireddy venkatareddy takes on telangana government | Sakshi
Sakshi News home page

త్వరలో హైకోర్టును ఆశ్రయిస్తా: కోమటిరెడ్డి

Oct 26 2016 3:56 PM | Updated on Mar 18 2019 8:57 PM

సచివాలయం కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.

హైదరాబాద్: సచివాలయం కూల్చివేతపై త్వరలో హైకోర్టును ఆశ్రయిస్తానని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. వాస్తుదోషం ఉందని సచివాలయాన్ని కూల్చాలని నిర్ణయించడం దారుణమని విమర్శించారు.

సచివాలయాన్ని కూల్చివేసి ప్రజాధనాన్ని వృథా చేస్తారా అని తెలంగాణ ప్రభుత్వాన్ని కోమటిరెడ్డి ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు రుణమాఫీ, ఇన్ఫుట్ సబ్సడీ, ఆరోగ్యశ్రీ పథకాలకు నిధులు లేవని, కొత్త సచివాలయానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయని నిలదీశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement