చిరంజీవికి మళ్లీ ఆపరేషన్ | Sakshi
Sakshi News home page

చిరంజీవికి మళ్లీ ఆపరేషన్

Published Thu, Mar 24 2016 12:38 PM

చిరంజీవికి మళ్లీ ఆపరేషన్ - Sakshi

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవికి మరో ఆపరేషన్ జరగనుంది. ఆయన ఎడమ భుజానికి త్వరలో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఆపరేషన్ జరగనుంది. ఈ మేరకు చిరంజీవి సన్నిహిత వర్గాలు గురువారం వెల్లడించాయి. త్వరలో చిరంజీవి కుమార్తె శ్రీజ వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత చిరంజీవి ఈ ఆపరేషన్ చేయించుకోనున్నారని తెలిపాయి. చిరంజీవి గత రెండేళ్లుగా భుజానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు.

గత నెలలో చిరంజీవి కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకున్నారు. తమిళంలో తెరకెక్కిన కత్తి సినిమాను చిరంజీవి హీరోగా 150వ చిత్రంగా రీమేక్ చేస్తున్న విషయం విదితమే. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 17వ తేదీన చెన్నైలోని నడిగర్ సంఘం భవన నిర్మాణం కోసం నిర్వహించనున్న క్రికెట్ మ్యాచ్ లో చిరంజీవి పాల్గొనున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement