‘సదావర్తి’ రొంపిలో తలదూర్చొద్దు | BJP high command orderes to the Minister Manikyala Rao | Sakshi
Sakshi News home page

‘సదావర్తి’ రొంపిలో తలదూర్చొద్దు

Jul 21 2016 2:06 AM | Updated on Mar 29 2019 9:31 PM

సంచలనం సృష్టించిన సదావర్తి సత్రం భూముల వేలం రొంపిలో తలదూర్చొద్దని ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావును బీజేపీ అధిష్టానం ఆదేశించింది.

మంత్రి మాణిక్యాలరావును ఆదేశించిన బీజేపీ అధిష్టానం!
 
 సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టించిన సదావర్తి  సత్రం భూముల  వేలం రొంపిలో తలదూర్చొద్దని ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావును బీజేపీ అధిష్టానం ఆదేశించింది. దీంతో ఆయన తన వద్దకు వచ్చిన భూముల అమ్మకం ఫైలుపై సంతకం పెట్టకుండా సీఎంవోకు తిప్పి పంపారు. సదావర్తి సత్రం భూముల అమ్మకం వ్యవహారం ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిన సంగతి తెల్సిందే. దీన్ని ‘సాక్షి’  వెలుగులోకి తేగా వైఎస్సార్‌సీపీ నేతల బృందం ఆ భూములను సందర్శించి వాస్తవాన్ని బహిర్గతం చేసింది.

బీజేపీ కూడా ప్రభుత్వ చర్యను తప్పుపట్టింది.కాంగ్రెస్, సీపీఐ ముఖ్యనేతలు కూడా చెన్నై సమీపంలోని సదావర్తి సత్రం భూములను పరిశీలించి నిజాలను వెల్లడించారు.దీంతో బీజేపీ అధిష్టానం మాణిక్యాలరావును  ‘సదావర్తి’కి దూరంగా ఉండమని చెప్పినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement