తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర శుక్రవారం ప్రారంభమైంది.
తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. ఈ యాత్రను చంచల్‌గూడ జైళ్ల ప్రధాన కార్యాలయంలో డీఐజీ నర్సింహులు ప్రారంభించారు. ఈ సైకిల్ యాత్రలో ఐదుగురు జైళ్ల శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అవినీతి రహిత సమాజం, ఏకత్వంలో భిన్నత్వం, పర్యావరణ పరిరక్షణ కోసం ఈ సైకిల్ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. వీరు తెలంగాణ వ్యాప్తంగా 2145 కి.మీల సైకిల్ యాత్ర చేస్తారు.