మంజునాథ కమిషన్‌లో ముగ్గురి నియామకం | ap government appoints three members in manjunath commission | Sakshi
Sakshi News home page

మంజునాథ కమిషన్‌లో ముగ్గురి నియామకం

Feb 24 2016 2:13 PM | Updated on Oct 9 2018 4:20 PM

కాపులను బీసీలలో చేర్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ మంజునాథ కమిషన్‌లో ముగ్గురు సభ్యులను నియమించారు.

కాపులను బీసీలలో చేర్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ మంజునాథ కమిషన్‌లో ముగ్గురు సభ్యులను నియమించారు. 1993 నాటి ఆంధ్రప్రదేశ్ వెనకబడిన వర్గాల చట్టంలో మూడో సెక్షన్ ప్రకారం సంక్రమించిన అధికారాలతో ఈ సభ్యులను నియమిస్తున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వులలో పేర్కొంది.

సామాజిక శాస్త్రవేత్త, ఆంధ్రా యూనివర్సిటీలో రిటైర్డ్ ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, బీసీల అంశానికి సంబంధించి ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన ఇద్దరు వ్యక్తులు.. ఆంధ్రా యూనివర్సిటీలో రిటైర్డ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ మల్లెల పూర్ణచంద్రరావు, ఏయూ కాలేజి ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ మాజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరాముల సత్యనారాయణలను నియమింస్తున్నట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement