నిలోఫర్‌లోనూ కల్తీ సెలైన్ బాటిళ్లు | Adulterated bottled saline cought in Niloufer Hospital | Sakshi
Sakshi News home page

నిలోఫర్‌లోనూ కల్తీ సెలైన్ బాటిళ్లు

Jul 7 2016 9:12 PM | Updated on May 25 2018 2:25 PM

సరోజనీ కంటి ఆస్పత్రిలో బుధవారం జరిగిన ఘటనతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది.

హైదరాబాద్: సరోజనీ కంటి ఆస్పత్రిలో బుధవారం జరిగిన ఘటనతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. ఆస్పత్రికి సరఫరా చేసే సెలైన్ బాటిళ్లలో కల్తీ జరిగిందని నిర్ధారణ కావటంతో సదరు కంపెనీని అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆ కంపెనీ సరఫరా చేసే అన్ని ఆస్పత్రుల్లోనూ డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు సోదాలు జరుపుతున్నారు.

గురువారం సాయంత్రం నిలోఫర్ పిల్లల ఆస్పత్రిలో తనిఖీలు చేయగా మొత్తం 39 వేల బాటిళ్లలో బ్యాక్టీరియా ఆనవాళ్లున్న 29వేల సెలైన్ బాటిళ్లు బయటపడ్డాయి. వాటి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపిస్తామని, వాటిని సీజ్ చేశామని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పావని తెలిపారు. అయితే, ఇప్పటికే పదివేల బాటిళ్లను వినియోగించినట్లు తేలిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement