పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా ఉండటంతో.. రానున్న రెండు రోజుల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా ఉండటంతో.. రానున్న రెండు రోజుల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సముద్రంపై వేటకు వెళ్లే మత్స్య కారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఆల్పపీడన ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.