పార్టీ ఫిరాయింపులపై అనర్హత వేటు వేయాలని టీడీపీ వర్కింగ్ ప్రసిడెంట్ రెవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘూన్ని కోరారు.
ఢిల్లీ: పార్టీ ఫిరాయింపులపై అనర్హత వేటు వేయాలని టీడీపీ వర్కింగ్ ప్రసిడెంట్ రెవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘూన్ని కోరారు. టీడీపీ టీఆర్ఎస్లో విలీనమైనట్లు స్పీకర్ మధుసూదనాచారి చేసిన ప్రకటన చెల్లదంటూ టీడీపీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘూన్ని కలిశారు. దీనిపై స్పీకర్ పైన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలోని పాత పది జిల్లాలను అనుసరించే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కేవలం తన రాజకీయ స్వార్ధం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని చెప్పారు.