వైఎస్ఆర్ జిల్లా కడప పట్టణంలోని క్రైమ్ విభాగంలో పనిచేసే హెడ్‌కానిస్టేబుల్ ఇంట్లో చోరీ జరిగింది.
పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో చోరీ
Jan 25 2016 10:24 AM | Updated on Aug 30 2018 5:27 PM
కడప క్రైమ్: వైఎస్ఆర్ జిల్లా కడప పట్టణంలోని క్రైమ్ విభాగంలో పనిచేసే హెడ్‌కానిస్టేబుల్ ఇంట్లో చోరీ జరిగింది. హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సురేష్ రవీంద్రనగర్‌లో నివాసం ఉంటున్నారు. సురేష్ ఆదివారం తిరుపతిలో ఉంటున్న భార్యా, పిల్లల దగ్గరకు వెళ్లి సోమవారం ఉదయం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి, లోపల బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. బంగారం చోరీకి గురైనట్టు ఆయన రవీంద్రనగర్ పరిధిలోని ఫిర్యాదు చేశారు.
Advertisement
Advertisement