అవార్డు వెనక్కి ఇచ్చేసిన రచయిత్రి కాత్యాయిని విద్మహే | Returning Sahitya Akademi award | Sakshi
Sakshi News home page

అవార్డు వెనక్కి ఇచ్చేసిన రచయిత్రి కాత్యాయిని విద్మహే

Oct 17 2015 4:59 PM | Updated on Sep 3 2017 11:06 AM

అవార్డు వెనక్కి ఇచ్చేసిన రచయిత్రి కాత్యాయిని విద్మహే

అవార్డు వెనక్కి ఇచ్చేసిన రచయిత్రి కాత్యాయిని విద్మహే

సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కి ఇచ్చేసిన రచయిత్రి కాత్యాయని విద్మహే

ప్రముఖ రచయిత, కళాకారుడు ఎం. భూపాల్ రెడ్డి బాటలోనే మరో తెలుగు రచయిత్రి కాత్యాయతి విద్మహే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కి ఇచ్చేశారు.  అసమానతలకు వ్యతిరేకంగా రచనలు చేస్తున్న తాను... భావ ప్రకటన స్వేచ్ఛపై దాష్టికానికి నిదర్శనగా  రచయితలు హత్య లకు గురికావడం బాధించిందని.. అందువల్లే అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ఆమె శనివారం  ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా.. సాహిత్యాకాశంలో సంగం అనే సాహిత్య విమర్శ వ్యాస సంపుటికి 2013లో కాత్యాయని విద్మహే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు.


తనకు రాజ్యాంగం పట్ల గౌరవం ఉందని, ఎటువంటి మినహాయింపులు లేకుండా.. రాజ్యంగం పౌరులకు వాగ్దానం చేసిన హక్కులను సంపూర్ణంగా అమలు చేయాలని కాత్యాయని విద్మహే డిమాండ్ చేశారు. భావ ప్రకటనా స్వేచ్చను నిరోధిస్తున్న దుష్ట సామాజిక సంస్కృతి పట్ల మౌనం సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. సాహిత్య అకాడమీ, రాజ్యానికి వ్యతిరేకంగా నిరసిస్తున్న తోటి రచయితలతో, కళాకారులతో గొంతు కలపటం గౌరవంగా భావిస్తున్నానని కాత్యాయని  తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement