కృష్ణా నదీ జలాల కేసుపై సుప్రీం కోర్టు గురవారం విచారణ చేపట్టింది.
కృష్ణా నదీ జలాల కేసు విచారణ వాయిదా
Dec 10 2015 11:50 AM | Updated on Aug 29 2018 9:29 PM
ఢిల్లీ: కృష్ణా నదీ జలాల కేసుపై సుప్రీం కోర్టు గురవారం విచారణ చేపట్టింది. విచారణలో కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలతో ధర్మాసనానికి అఫడివిట్ అందజేసింది. అయితే నీటి పంపకాలు, ఏపీ, తెలంగాణ మధ్యే జరగాలన్న కేంద్ర ప్రభుత్వ వైఖరి పై సమాధానం ఇచ్చేందుకు మరింత సమయం కావాలని తెలంగాణ తరపు న్యాయ వాదులు ధర్మాసనాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రం గడువు కోరడంపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో జనవరి 13 కు కేసును సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
Advertisement
Advertisement