
అనుగ్రహం, గురువారం 9, జులై 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం,
శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం,
గ్రీష్మ ఋతువు, అధిక ఆషాఢ మాసం,
తిథి బ.అష్టమి ప.3.21 వరకు, తదుపరి నవమి,
నక్షత్రం రేవతి సా.5.58 వరకు, తదుపరి అశ్వని,
వర్జ్యం ఉ.6.47 నుంచి 8.17 వరకు,
దుర్ముహూర్తం ఉ.9.54 నుంచి 10.44వరకు,
తదుపరి ప.3.07 నుంచి 3.57 వరకు,
అమృతఘడియలు ప.3.44 నుంచి 5.10 వరకు
సూర్యోదయం : 5.35
సూర్యాస్తమయం : 6.35
రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు
భవిష్యం
మేషం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆలయ దర్శనాలు.బంధువులతో విభేదాలు. అనారోగ్యం. దూర ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
వృషభం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పాత బాకీలు వసూలవుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మిథునం: నూతన ఉద్యోగ ప్రాప్తి. సంఘంలో గౌరవం లభిస్తుంది. వస్తు లాభాలు. కార్య సిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
కర్కాటకం: మిత్రులతో వివాదాలు రావచ్చు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటా బయటా చికాకులు పెరగవచ్చు. ఆరోగ్య సమస్యలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం నెలకొంటుంది.
సింహం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కన్య: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా మెలగుతారు. విందు వినోదాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులను కొత్త పోస్టులు వరిస్తాయి.
తుల: బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. భూవివాదాల పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
వృశ్చికం: మిత్రులతో విభేదాలు రావచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు. దూర ప్రయాణాలు. సోదరులు, సోదరీలతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. కుటుంబ సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
మకరం: కుటుంబసభ్యులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. భూములు, వాహనాలు కొంటారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
కుంభం: వ్యయ ప్రయాసలు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలలో మార్పులుంటాయి. పనులు వాయిదా వేస్తారు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉంది.
మీనం: శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం తీసుకుంటారు. ఆప్తుల సలహాలు పాటిస్తారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు అందుతాయి.
- సింహంభట్ల సుబ్బారావు