రంగారెడ్డి జిల్లా పరిగి సమీపంలో బుధవారం జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పరిగి సమీపంలో బుధవారం జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివాహ వేడుకకు వెళ్తూ నలుగురు మృతిచెందడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా, ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఆరా తీశారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.