ఇద్దరు విద్యార్థులను ఢీకొన్న స్కూల్ బస్సు | 2 students injured in school bus accident | Sakshi
Sakshi News home page

ఇద్దరు విద్యార్థులను ఢీకొన్న స్కూల్ బస్సు

Dec 16 2015 12:17 PM | Updated on Nov 9 2018 4:44 PM

ఇద్దరు విద్యార్థులను ఢీకొన్న స్కూల్ బస్సు - Sakshi

ఇద్దరు విద్యార్థులను ఢీకొన్న స్కూల్ బస్సు

మలక్‌ పేటలోని మెస్కో స్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులను అదే స్కూల్‌కు చెందిన బస్సు ఢీకొట్టింది.

హైదరాబాద్ : మలక్‌ పేటలోని మెస్కో స్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులను అదే స్కూల్‌కు చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యారులు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన అమీన కౌసర్ అనే ఆరేళ్ల బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement