మరో రాజకీయ విప్లవానికి నాంది

Special Column On YSRCP President YS Jagans Prajasankalpayatra - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సాగించిన ప్రజా సంకల్పయాత్ర రాజకీయ, సామాజిక విప్లవానికి నాంది పలికింది. సకల సామాజిక వర్గాలూ ఈ యాత్ర పొడవునా జగన్‌మోహన్‌ రెడ్డి వెంట నడిచిన తీరు నిజంగా అపూర్వమని చెప్పాలి. ప్రజాభిమానం చూరగొనాలంటే వారి గుండె తలుపు తట్టాలని, వారి బాధల్ని ఓపిగ్గా విని పరిష్కార మార్గాలు ఆలోచించాలని ఈ యాత్ర ద్వారా జగన్‌ చాటిచెప్పారు. ప్రజాబలం ముందు ప్రభుత్వాలు సృష్టించే అవాంతరాలు దూదిపింజెల్లా తేలిపోతాయని నిరూపించారు. రాజకీయాలంటే తెరవెనక కుట్రలు, కుతంత్రాలు నడపటం అని...ప్రత్యర్థులపై బురదజల్లి వారిని దెబ్బతీయటమని అనుకున్న చంద్రబాబుకు ఈ ప్రజాసంకల్ప యాత్రతో ఊపిరాడటం లేదు.

‘జగన్నాథ రథ చక్రాలను భూమార్గం పట్టిస్తాను.. భూకంపం పుట్టి స్తాను’ అని ఆనాడు మహాకవి శ్రీశ్రీ ఆనాడు అన్నారు. తన ప్రజా సంక ల్పయాత్రతో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అదే స్ఫూర్తిని రాజకీయాలకు అన్వయిస్తూ  ఆంధ్రప్రదేశ్‌లో పెను రాజకీయ విప్లవాన్ని తీసుకువ చ్చారు. దేశ, విదేశీ కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తున్న రాష్ట్ర రాజకీ యాలను భూమార్గం పట్టించి ప్రజల చెంతకు తీసుకువచ్చారు. విచ్చల విడి అవినీతితో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్న అవినీతిపరుల గుండెల్లో భూకంపం పుట్టించారు. 2017, నవంబర్‌ 6న ఇడుపుల పాయలో ఆయన వేసిన అడుగు... దారిపొడుగునా అశేష జననీరాజనాలు అందు కుంటూ... 3,650 కి.మీ. ప్రస్థానంలో కోటిన్నరమంది ఆయన అడు గుల్లో అడుగు కదపగా...  2019, జనవరి 9కి ఇచ్ఛాపురం చేరేనాటికి అది ప్రజా ఉప్పెనగా రూపాంతరం చెందింది. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తూ, సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ.. ఇచ్ఛా పురంలో అది విజయసంకల్ప స్థూపంగా ఆవిష్కృతం కాబోతోంది.

రామన్న... రాజన్న... వెరసి జగనన్న 
ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఇప్పటివరకు ప్రజాముఖ్యమంత్రులుగా పేరొం దిన వారు ఇద్దరు... ఒకరు ఎన్టీరామారావు, మరొకరు వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెడుతుంటే ఆనాడు తిరగబడ్డ తెలుగుబిడ్డగా ఎన్టీరామారావు చైతన్యరథంపై రాష్ట్రం చుట్టి ముట్టి రాజకీయ విప్లవం తీసుకువచ్చారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించి విచ్చలవిడి అవినీతితో రాష్ట్రం భ్రష్టుపట్టి పోతున్న వేళ 2003లో ప్రజల ఆశాకిరణంగా వై.ఎస్‌.రాజశేఖ రరెడ్డి రాష్ట్రంలో పాదయాత్రకు చేశారు. ప్రజాప్రస్థానంతో పాదయాత్ర నిర్వహించి వై.ఎస్‌. రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలికి మానవీయ ప్రభుత్వం అంటే ఏమిటో చూపించారు. విభజనానంతరం 2014లో చంద్రబాబు అధికారం చేపట్టాక ప్రజలు పెను సమస్యల్లో కూరుకుపోయారు.

ముఖ్యమంత్రిగా ఆయన రాజధాని నిర్మాణం ముసు గులో విదేశీ కార్పొరేట్‌ సంస్థలకు రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నారు. రాష్ట్ర ప్రగతికి సంజీవని వంటి ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలను గాలికి వదిలేశారు. సంతలో పశువుల మాదిరిగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొను గోలు చేస్తూ  ప్రజాస్వామ్య విలువలను కాలరాశారు. విచ్చలవీడి అవినీతితో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు. భవిష్యత్‌ అంధకారబంధు రంగా మారుతున్న సంకట స్థితిలో రాష్ట్రం కోసం, ప్రజల కోసం నేను న్నానంటూ వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముందడుగు వేశారు. ఇడుపుల పాయ వద్ద ఆయన ప్రారంభించిన ప్రజాసంకల్ప యాత్ర రాష్ట్రంలో సరి కొత్త రాజకీయ శకానికి నాంది పలికింది. 

రాజకీయ, సామాజిక విప్లవం
ప్రజా అజెండానే జెండాగా వై.ఎస్‌.జగన్‌ సాగించిన పాదయాత్ర రాష్ట్రంలో సరికొత్త రాజకీయ, సామాజిక విప్లవానికి నాంది పలికింది. దాదాపు కోటిన్నరమంది ఆయన అడుగులో అడుగేసి పాదయాత్రలో పాల్గొనడం ఒక అపురూపమైన అంశం.  ఈ పాదయాత్రలో  రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మత్స్యకా రులు, బ్రాహ్మణులు, నాయిబ్రాహ్మణులు, ఆర్యవైశ్యులు, కళింగ కోమట్లు, కల్లు గీత కార్మికులు, న్యాయవాదులు, డ్వాక్రా సంఘాలు, అంగన్‌వాడీ కార్యకర్తలు... ఇలా పలువర్గాల వారితో జగన్‌ ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలతోపాటు రాజకీయ అవకాశాల కల్పనకు విధాన నిర్ణయాలను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే అమలు చేయనున్న నవరత్నాల పథకాలను వివరించారు.

కృష్ణా జిల్లాకు ఎన్టీరామారావు పేరుపెడతా మని ప్రక టించడం ద్వారా సగటు ఎన్టీరామారావు అభిమాని మనసు గెలుచుకున్నారు.  మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు పేరుతో ఓ జిల్లా ఏర్పాటు చేస్తామని పశ్చిమగోదావరి జిల్లాలో జగన్‌ చేసిన ప్రక టనపట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇలా అన్ని వర్గాల అఖండ ఆదరణతో రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్టయింది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు 1.30 కోట్ల ఓట్లు వచ్చాయి. టీడీపీ కంటే కేవలం 5 లక్షల ఓట్లు వెనుకబడి అధికారానికి దూరమైంది. జగన్‌మోహన్‌రెడ్డి సాగించిన ఈ పాదయాత్ర పాత సమీకరణాలను సమూలంగా మార్చేసింది. ప్రజా సంకల్పయాత్ర పొడవునా పార్టీ నేతలు, కార్యకర్తలు కాకుండా ఇతరులు కోటిన్నర మందిని కొత్తగా జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నారు.

వారి సమస్యలు అవగాహన చేసుకుని పరిష్కారానికి విధానపరమైన నిర్ణయాలను ప్రక టించారు. ఈ ప్రక్రియంతా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను రాష్ట్రంలో మొక్క వోని శక్తిగా మార్చింది. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పెను ప్రభం జనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల పలు జాతీయ ఛానెళ్లు నిర్వహించిన సర్వేలూ అదే విషయాన్ని వెల్లడించడం రాష్ట్ర ప్రజల మనోభీష్టాన్ని వెల్లడిస్తోంది. ప్రజాజీవితంలో కొనసాగా లంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం ఒక్కటే మార్గమని నాయకులం దరూ భావించే విధంగా ప్రజాభిమానం పోటెత్తింది. పలువురు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులుగా పనిచేసి రిటైరైనవారు దీన్ని గుర్తించే పార్టీకి చేరువయ్యారు.

టీడీపీ గుండెల్లో భూకంపం
ప్రజా ఉప్పెనగా సాగిన వై.ఎస్‌.జగన్‌ పాదయాత్ర అధికార టీడీపీ ప్రభుత్వం గుండెల్లో భూకంపం పుట్టించింది. పాదయాత్ర తీసుకు వచ్చిన రాజకీయ చైతన్యం ప్రభావం ప్రస్పుటంగా కనిపిస్తోంది. జన్మ భూమి సభల్లో ప్రజలు నిలదీస్తుంటే మంత్రులు, టీడీపీ ప్రజాప్రతిని ధులు నీళ్లు నములుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న సభల్లో సైతం జనాగ్రహం ఆనవాళ్లు ప్రస్ఫుటమయ్యాయి. బాబు మాట్లాడుతుంటే ప్రజల నుంచి ఏమాత్రం స్పందన కనిపించడం లేదు. జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు సంధించి ప్రజల స్పందన కోసం చూసి నప్పుడు ఆయనకు తరచుగా నిరాశే ఎదురవుతోంది. దాంతో ముఖ్య మంత్రి, మంత్రులు, టీడీపీ నాయకులు మాట్లాడుతున్న తీరులో బేల తనం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పాదయాత్ర మీద, జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం మీద.. విమ ర్శలు, ఆరో పణలు గుప్పించినప్పుడు ప్రజల్లో పెద్దగా స్పందన ఉండక పోవడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రజల్లో ముఖ్య మంత్రి చంద్రబాబు విశ్వాసం కోల్పోయారని చెప్పడానికి దీన్నో నిదర్శనంగా భావించాలి.

చంద్రబాబు కుతంత్రాలకు కాలం చెల్లు 
జగన్‌ పాదయాత్రతో తమ పుట్టి మునుగుతుందని గుర్తించిన చంద్ర బాబు కొత్త రాజకీయ తంత్రాలకు తెరతీశారు. నాలుగేళ్లకుపైగా అంట కాగిన బీజేపీ నుంచి వేరుపడి ప్రత్యేక హోదా కావాలంటూ సరికొత్త నాటకం మొదలుపెట్టారు. ఈ ఎత్తుగడకు ప్రజల నుంచి ఏమాత్రం సానుకూల స్పందన రాకపోవడంతో చంద్రబాబు కొత్త పొత్తులను వెతుక్కునే పనిలో పడ్డారు. ఆవిర్భావం నుంచి టీడీపీకి బద్ధశత్రువుగా ఉన్న కాంగ్రెస్‌తో జట్టుకట్టారు. తెలంగాణా ఎన్నికల్లో ఈ పొత్తును ప్రజలు తిరస్కరించడంతో ఏం చేయాలో బాబుకు తోచడం లేదు. అక్కడే అలా ఉంటే ఏపీలో పుట్టగతులు ఉండకపోవచ్చునని ఆయనకు అర్ధమైంది. విశాఖపట్నం విమానాశ్రయంలో వై.ఎస్‌.జగన్‌పై జరిగిన విఫల హత్యాయత్నం వెనకున్న కుట్రలు, కుతంత్రాల్లో ఎవరి హస్తం ఉన్నదో, దీనికంతకూ కారకులెవరో ప్రజలకు సులభంగానే అర్ధమైంది. 

పవన్‌ను అడ్డంపెట్టుకుని రాజకీయ పన్నాగం
ఇలాంటి దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు జనసేన అధినేత పవన్‌ కల్యా ణ్‌తో కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారు.  జగన్‌మోహన్‌ రెడ్డి పాద యాత్ర ప్రారంభమైన కొంతకాలానికే పవన్‌ కల్యాణ్‌ జిల్లాల పర్యటనలు చేపట్టడం వెనుక చంద్రబాబు ఎత్తుగడ ఉంది.  ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా టీడీపీకి ప్రయోజనం కలిగించాలన్న లక్ష్యం తోనే ఆయన పర్యటనలకు రూపకల్పన చేశారు. ఇదంతా సాగిస్తూనే ఏమీ ఎరగనట్టు వైఎస్సార్‌ కాంగ్రెస్, జనసేన, బీజేపీ కలుస్తున్నా యంటూ చంద్రబాబు దుష్ప్రచారం మొదలుపెట్టారు. తాము ఒంటరి గానే పోటీ చేస్తామన్న జగన్‌ మాటనే ప్రజలు విశ్వసించడంతో ఆ ఎత్తు చిత్తయింది. ఈ నేపథ్యంలో దింపుడుకళ్లెం ఆశతో చంద్రబాబు మరో ఎత్తుగడ వేశారు. ముసుగు తొలగిస్తూ పవన్‌ కల్యాణ్‌కు పరోక్షంగా స్నేహహస్తం అందిస్తూ ఎన్నికల అనంతరం పొత్తుపై సంకేతాలు ఇచ్చారు.

అయితే ప్రజలు అమాయకులు కాదు. చంద్రబాబు– పవన్‌ కల్యాణ్‌ తెరచాటు స్నేహంపై వారికి పూర్తి అవగాహన ఉంది. కనుకనే  ఈ ఎత్తుగడలన్నీ వరుసగా బెడిసి కొడుతున్నాయి. తీవ్ర ప్రజావ్యతిరేకతతో రాష్ట్రంలో టీడీపీ గ్రాఫ్‌ అంతకంతకు అమాంతంగా పడిపోతుండటం స్పష్టంగానే కనబడుతోంది. ‘మళ్లీ చంద్రబాబే రావాలి’ అన్న టీడీపీ నినాదాన్ని ప్రజలు తిప్పికొడుతు న్నారు. ‘ఈసారి జగన్‌కే అవకాశం ఇద్దాం... రాజన్న సంక్షేమ రాజ్యం తీసుకువద్దాం’ అని కుండబద్దలు కొడుతున్నారు. రానున్న ఎన్నికల్లో విజయదుందుభి మోగించేలా వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు రాష్ట్రమంతటా సానుకూల పవనాలు సృష్టించడంలో వై.ఎస్‌.జగన్‌ పాదయాత్ర విజ యవంతమైందన్నది సుస్పష్టం. ప్రజా సంకల్ప యాత్రతో రాష్ట్రంలో మరో రాజకీయ విప్లవానికి బీజం పడిందన్నది నిర్వివాదాంశం. 

సాక్షి ప్రత్యేక ప్రతినిధులు, అమరావతి బ్యూరో
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top