మావోకి సెల్యూట్‌ చేస్తారు... మావోయిస్టులను వెంటాడతారు..

Guest Column On Maoisam - Sakshi

అభిప్రాయం

చైనా, నేపాల్‌ దేశాలతో స్నేహాన్ని కాంక్షిస్తూ ఆ దేశాల్లో పర్యటనలు చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ మరోవైపు భారత్‌లో మావో జెండాలను, ఎజెండాను భుజాన మోస్తున్న వామ పక్ష విప్లవ శక్తుల నెత్తురుటేరులు పారించటం గర్హనీయం. ఏప్రిల్‌లో నరేంద్రమోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కలవటానికి ముందే కాకతాళీయంగానే మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 40 మంది మావోయిస్టులపై తుపాకీ ఎక్కుపెట్టి హతమార్చుతారు.. ఒకవైపు నవ చైనా నిర్మాణాన్ని కీర్తిస్తూనే, మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఇంపెంట అటవీ ప్రాంతంలో ఆదివాసీ ఉద్యమకారుల సంహారం చేస్తారు. చైనా, నేపాల్‌ దేశాల స్ఫూర్తితో మోదీ మన దేశంలో మావోయిస్టుల ఏరివేత ముసుగులో జరుగుతున్న మానవ హననం ఆపాలి.

ఆధునిక ప్రపంచ చరిత్రలో మావో జెడాంగ్‌  ఓ వేగు చుక్క. మావో  సిద్ధాం తాలు, సైనిక వ్యూహాలు, రాజకీయ విధానాలు సంయుక్తంగా నవ చైనాను ఒక ప్రపంచ శక్తిగా నిలబెట్టాయి. ఆయన  సిద్ధాంతాలు.. ఆశయాల కొనసాగింపు గానే  చైనా దేశం బయట అటు నేపాల్‌ లోనూ ఇటు భారత్‌లోనూ ‘మావోయి జం’  జీవం  పోసుకుంది..విస్తరించింది.. నేపాల్‌లో రాచరిక వ్యవస్థ వ్యతిరేక ఉద్యమంగా 1990 దశకంలో మొగ్గతొడిగిన మావోయిస్టు సాయుధ పోరాటం  చివరికి రాజ్యాధికారాన్ని సాధించింది. 

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి కాలంలో మావో ప్రభావిత దేశాలు  చైనా,  నేపాల్‌లో అడుగు పెట్టారు. ఆ రెండు దేశాలతో స్నేహాన్ని కాంక్షించారు. ఇది శుభ పరిణామమే. అదే సమయంలో భారత్‌లో మావో జెండాలను, ఎజెండాను భుజాన మోస్తున్న వామపక్ష విప్లవ శక్తుల నెత్తురుటేరులు పారించటం గర్హించాల్సిన అంశమే. ఏప్రిల్‌ మాసంలో మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కలవటానికి ముందే కాకతాళీయంగానే మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 40 మంది మావోయిస్టులపై తుపాకీ ఎక్కుపెట్టి హత మార్చుతారు.. చైనా పర్యటన సందర్భంగా మోదీ నవ చైనా నిర్మాణాన్ని కీర్తిస్తుంటే.. మరో వైపు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఇంపెంట అటవీ ప్రాంతంలోఆదివాసీ ఉద్యమకారుల సంహారం చేస్తారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి గానీ దండకారణ్యంలో అప్పుడూ ఇప్పుడూ కూడా ఎమర్జెన్సీనే. ఎందు కంటే ఎమర్జెన్సీ నాటి పరిస్థితులే నేడూ కొనసాగుతున్నాయి. అప్పుడు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇప్పుడు ప్రకటిం చకుండానే దానిని అమలు చేస్తున్నారు.  విశ్వాసాలు మూఢంగా ఉన్నా ఫరవాలేదు. కానీ అవి బలమైన భావజాలాలు కాకూడదు, దోపిడీ, నిరంకుశాన్ని ప్రశ్నించే ఆయుధాలు కాకూడదంటూ విశ్వా సాల మీదే పోలీసులు దాడి చేస్తుంటే, అప్రకటిత నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న దండకారణ్య ఆదివాసీల ఉద్యమాన్ని ఆపేందుకు మానవ హననంగా గ్రీన్‌ హంట్‌ సాగుతోంది. చైనా, నేపాల్‌ దేశాల స్ఫూర్తితో మోదీ మన దేశంలో మావోయిస్టుల ఏరివేత ముసుగులో జరుగుతున్న మానవ హననం ఆపాలి.    

భౌగోళికంగా, వ్యావసాయికంగా సారూప్యం ఉన్న భారత్, చైనాల జాతీయ ఆదాయం వ్యవసాయంపైనే ఆధారపడింది. 1980 తర్వాత చైనా అభివృద్ధిపరంగా దూసుకుపోయింది. చైనా 800 శాతం వృద్ధిని సాధించగా.. భారత్‌ 200 శాతం వృద్ధితో మాత్రమే సరిపెట్టుకుంది. పైగా ప్రజల మధ్య ఆర్థిక అసమాన తలను చైనా నియంత్రించుకోగా... భారత్‌లో మాత్రం అంత కంతకూ పెరుగుతూ వచ్చింది. ప్యారిస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ ఆధ్వర్యంలో ఇనీక్వాలిటి ల్యాబ్‌ ఇటీవలే  ప్రచురించిన ప్రపంచ అసమానతల నివేదిక ప్రకారం  చైనా ఆదాయంలో 14 శాతం వాటా సంపన్నవర్గ శ్రేణిలో ఉండే ఒక శాతం ప్రజల వద్ద ఉండగా, అదే భారత్‌లో 22 శాతం ఉంది. కారణం నవ చైనా  నిర్మాణం లోని ప్రత్యేకతే.æవిద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనకు ఆ దేశం  ఎక్కువ ఖర్చు పెట్టినందున అట్టడుగున ఉన్న 50 శాతం ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి వారి ఆదాయాలు కూడా పెరిగాయి. చైనా వేగంగా అభివృద్ధి చెందింది. పేదరికాన్ని తగ్గించుకున్నది. సగటు ఆదాయాన్ని పెంచుకున్నది. ఆదాయాల పంపిణీలో అస మానతలు తక్కువగా ఉండేట్టు ప్రణాళిక చేసు కున్నది. 

ఆర్థికవేత్త లుకాస్‌ చాన్సేల్‌ ప్రకారం.. ‘ఆర్థిక వ్యవస్థ ద్వారాలు  బార్లా  తెరచినప్పుడు అది పెట్టుబడిదారులకు, అధిక ఆదాయాలు కలిగిన  వర్గాల  వారికి అనుకూలంగా మారుతుంది. దీనితోనే అసమానతలు తీవ్రస్థాయిలో పెరుగుతాయి. కార్పొరేటు పన్నులు తగ్గించడం, అధిక ఆదాయ శ్రేణి వర్గాలకు రాయితీలి వ్వడం, పన్నులు తగ్గించడం వంటి నిర్ణయాలు అసమానతలు పెరగడానికి కారణమవుతాయి. వేతనాలలో సమతుల్యత లోపిం చడం, తీవ్ర వ్యత్యాసాలు ఉండటం, ప్రైవేటీకరణ, కాంట్రాక్టు ఉద్యోగాలు పెరగడం అసమానతలకి కారణాలు అవుతాయి. పోస్కో, వేదాంత లాంటి బహుళజాతి సంస్థలకు పన్నుల్లో మిన హాయింపు ఇచ్చి, రాయితీలు ప్రకటించి పచ్చని అటలీ సంపద మీదకు వదిలిన కారణంగా, జీవించే హక్కును కోల్పోతున్న ఆది వాసీలు చేస్తున్న బతుకు పోరాటాన్ని మోదీ ఒక్కసారి మావో దృక్కోణంతో చూడగలిగితే ఇంతకాలం దండకారణ్యంలో కొనసా గించిన అరాచకాల మూల్యమెంతో తెలుస్తుంది.

ఆర్థిక సంస్కరణల తర్వాత భారతదేశంలో అభివృద్ధి అనేది  కార్పొరేట్లకు అనుకూలంగా మారింది. ఉదారవాద విధానాల వల్ల ప్రభుత్వరంగం బలహీనపడి ప్రైవేటురంగం పుంజుకున్నది. ప్రైవేటురంగానికి ప్రోత్సాహమివ్వడంవల్ల ఎక్కువ ప్రగతి సాధిం చవచ్చని, ఉపాధి అవకాశాలు, ప్రజల జీవన ప్రమాణాలు మెరు గవుతాయని నమ్మబలికారు. కానీ నయా ఆర్థిక విధానాల అమలు వల్ల వచ్చిన ప్రయోజనాలన్నీ కొద్ది మంది ఉన్నత శ్రేణి వర్గాలకే దక్కాయి. పేదలు, అణగారిన వర్గాలకు కలిగిన ప్రయోజనాలు శూన్యం. ధనికులే మరింత ధనికులయ్యారు. సాధించిన అర్థిక వృద్ధిలో మూడవ వంతు ఫలితాలు కూడా ప్రజలకు అందలేదు. ప్రభుత్వ విధానాలలో జోక్యం చేసుకునే శక్తిని ఉదారవాద విధా నాలు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాయి. ఇది ఆశ్రిత పెట్టుబడి దారీ విధానాలకు దారి తీసింది. ఫాసిస్టు తరహా శక్తులు, ప్రజావ్యతిరే కులు అదను చూసి పంజా విసురుతూనే ఉన్నాయి.  ఫలితంగా సామ్రాజ్యవాద ప్రపంచీకరణ దుష్ఫలితాలు మనం అనుభవి స్తున్నాం. దేశంలో గంటకో రైతు ఆత్మహత్య జరుగుతోంది. 

యువతకు ఉద్యోగ భద్రత పోయింది. కాస్ట్‌ కటింగ్‌ పేరుతో పరిశ్రమల్లో పనిచేసి లక్షల మంది కార్మికులను ఉద్యోగాల్లోంచి తొలగించారు. అక్టోబర్‌ 2016–అక్టోబర్‌ 2017 వరకు 12 నెలల కాలంలో 90 లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయి. శరవేగంగా విస్తరిస్తున్న రోబోటిక్స్, యాంత్రీకరణతో ఇంకా ఎంతమంది ఉద్యోగాలు ఊడిపోతాయో అంచనాకు కూడా అందటం లేదు. సిల్క్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా, స్టార్ట్‌ అప్‌ ఇండియా నినా దాన్ని ఎత్తుకొని భారతీయ యువత ఉద్యోగాన్వేషకులుగా కాక ఉద్యోగాల సృష్టికర్తలుగా మారతారని మోదీ చెప్పిన మాటలు డాంబికాలుగానే మిగిలిపోయాయి. ఏడాదికి కోటి ఉద్యోగాల చొప్పున సృష్టించి యువతకు ఇస్తామన్న మోదీ ప్రభుత్వం నాలుగేళ్లు గడిచినా లక్ష ఉద్యోగాలు నింపలేదు. ఈ నిరాశ నిస్పృహల తోనే యువత తీవ్రవాదం వైపునకు మళ్లుతోంది. మావో, లెనిన్‌ లాంటి విప్లవ వైతాళికుల సిద్ధాంతాలను, వ్యూహాలను మనకు తగ్గట్టుగా మలుచుకొని నిరుద్యోగ సమస్యను రూపు మాపాల్సిన తక్షణ కర్తవ్యం కేంద్ర పాలకుల మీద ఉంది.

సోలిపేట రామలింగారెడ్డి ,వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు
మొబైల్‌ : 94403 80141

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top